Priyanka Chopra Sell Her Apartment: ఇటు బాలీవుడ్‌లో, అటు హాలీవుడ్‌లో.. తన నటన, ముఖ్యంగా తన వ్యక్తిత్వంతో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా (Bollywood Actress Priyanka Chopra). 2018లో నిక్ జోనాస్‌తో వివాహం ‍‌(Priyanka Chopra's husband Nick Jonas) జరిగిన తర్వాత, ప్రియాంక లాస్ ఏంజిల్స్‌కు మకాం మార్చింది. ప్రస్తుతం ఈ జంట, వారి కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌తో ‍‌(Priyanka Chopra's daughter name Malti Marie Chopra Jonas) కలిసి నివసిస్తోంది.


రూ.6 కోట్లకు రెండు డీల్స్‌
నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, హాలీవుడ్‌లో ఎంగేజ్‌మెంట్స్‌ నేపథ్యంలో, ఇండియాలోని ఆస్తులను ప్రియాంక అమ్ముతోంది. ముంబైలోని పోష్‌ ఏరియా అయిన అంధేరీ శివారులో ఉన్న రెండు అపార్ట్‌మెంట్‌ పెంట్‌హౌస్‌లను.. దర్శకుడు, నిర్మాత & స్క్రీన్ రైటర్ అభిషేక్ చౌబేకి ‍‌(director Abhishek Chaubey) రూ. 6 కోట్లకు విక్రయించింది.


మనీ కంట్రోల్‌లో రిపోర్ట్‌ నివేదిక ప్రకారం, రెండు ఫ్లాట్ల మొత్తం విస్తీర్ణం 2,292 చదరపు అడుగులు. ఈ సేల్‌ డీల్‌ (Priyanka Chopra sells her property) అక్టోబర్ నెలలో జరిగింది. 


లోఖండ్‌వాలాలోని కరణ్ అపార్ట్‌మెంట్ టవర్‌లో, 9వ అంతస్తులో ఉన్న ఈ రెసిడెన్షియల్‌ ఫ్లాట్స్‌ అమ్మకాలను ప్రియాంక తల్లి మధు చోప్రా (Priyanka Chopra's mother Madhu Chopra) చూసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 23, 25 తేదీల్లో వాలాదేవీలు జరిగాయి. ఫ్లాట్లను కొన్న చౌబే, మొత్తం స్టాంప్ డ్యూటీ ఛార్జీలుగా రూ. 36 లక్షలు చెల్లించారు.


Zapkey.com అందించిన సమాచారం ప్రకారం, మొదటి పెంట్‌హౌస్ 860 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది, దాని రేటు రూ. 2.25 కోట్లు. రెండో పెంట్‌హౌస్‌ 1,432 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది, దాని రేటు రూ.3.75 కోట్లు. రెండూ కలిపి రూ. 6 కోట్ల డీజ్‌ జరిగింది. 


అంతకుముందు ఏప్రిల్‌లోనూ రూ. 7 కోట్ల ఆస్తిని ప్రియాంక అమ్మింది. లోఖండ్‌వాలాలోని ఒక కమర్షియల్ ప్రాపర్టీని, 2021లో, దంత వైద్య దంపతులకు ఈ యాక్ట్రెస్‌ అద్దెకు ఇచ్చింది. 465 చదరపు అడుగుల టెర్రస్‌తో కలిసి మొత్తం 1,781 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఉన్న ఆ ఆఫీస్‌ స్పేస్‌ కోసం నెలకు రూ.2.11 లక్షల చొప్పున ప్రియాంక వసూలు చేసింది. ఆ తర్వాత, ఈ ఏడాది ఏప్రిల్‌లో వారికే  రూ.7 కోట్లకు విక్రయించింది. 


ప్రియాంక చేతిలో ఉన్న ప్రాజెక్టులు (Priyanka Chopra movies)
ప్రస్తుతం, 'హెడ్స్ ఆఫ్ స్టేట్'లో (Heads of State) నటించేందుకు ప్రియాంక చోప్రా సిద్ధంగా ఉంది. 'సిటాడెల్ 2' ‍‌(Citadel 2) కూడా లిస్ట్‌లో ఉంది. ఇవి కాకుండా, అలియా భట్ (Bollywood Actress Alia Bhatt), కత్రినా కైఫ్‌తో ‍‌(Bollywood Actress Katrina Kaif) కలిసి, ఫర్హాన్ అక్తర్ 'జీ లే జరా'లో (Farhan Akhtar's Jee Le Zaraa) నటిస్తోంది.


నటుడు రణవీర్ సింగ్ ‍‌(Actor Ranveer Singh) కూడా, గత వారం, ముంబైలో ఒక భారీ ప్రాపర్టీ డీల్‌ కుదుర్చుకున్నాడు. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న తన రెండు అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లను (Ranveer Singh sells his property) విక్రయించాడు. ఆ రెండు ఫ్లాట్ల ఖరీదు రూ.15.25 కోట్లు. ఈ రెండు ఫ్లాట్‌లు ఒబెరాయ్ రియాల్టీ ప్రాజెక్ట్స్ ఒబెరాయ్ ఎక్స్‌క్లూజివ్‌లో భాగం. ఈ డీల్‌ కోసం స్టాంప్ డ్యూటీగా రూ.45.75 లక్షలు చెల్లించారు.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial