రాజకీయ ప్రత్యర్థి ఫిర్యాదు చేశాడన్న కారణంతో క్రిమినల్ కేసుల్ని కొట్టి వేయడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఆర్పీసీ  సెక్షన్ 482 ప్రకారం క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. రాజకీయ ప్రత్యర్థి అయినా.. రాజకీయ కారణాలతో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లయితే రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయడం హైకోర్టుల ద్వారా సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసంది. ఓ కేసులో నిందితునిగా ఉన్న ఉత్తరప్రదేస్ రాజకీయ నేత రాంవీర్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ధర్మాసనం ఈ విధంగా పేర్కొంది. తన రాజకీయ ప్రత్యర్థి .. రాజకీయ కారణాలతో తనపై పిటిషన్ వేసి కేసు నమోదు చేయించారని ఈ కారణంగా తనకు కేసు నుంచి విముక్తి కల్పించాలని రాంవీర్ ఉపాధ్యాయ కోరారు. 


‘పాపం చేసిన వ్యక్తికీ భవిష్యత్తు ఉంటుంది’ దోషికి ఉరిశిక్ష రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


అయితే ఈ కేసులో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 511, 1860 (IPC) మరియు సెక్షన్ 3(1)(Dha)తో పాటు సెక్షన్ 365 కింద దాఖలు చేసిన ఫిర్యాదును   పరిగణలోకి తీసుకున్నారన్నారు. అయితే రాజకీయ పగతో  ఫిర్యాదు చేయడం క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్పష్టమైన సాక్ష్యాలు ఉంటే రాజకీయ ప్రత్యర్థి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవచ్చని గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం తీర్పులో ఊటంకించింది. ఈ కేసులో నిందితుడైన రాంవీర్‌పై ఉన్న ఆరోపణలు నిజమా కాదా.. అన్నది విచారణలో తేలుతుందని.. కానీ విచారణను మాత్రం నిలిపివేసే అవకాశం లేదన్నారు. 


"సహజీవనం" నిషేధంపై ఆలోచించాల్సిందే - మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు


రాజకీయ నేతలపై అనేక సందర్భాల్లో ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కోర్టులను ఆశ్రయిస్తూ ఉంటారు. అవినీతి లేదా ఇతర నేరాలకు సంబంధించిన అంశాల్లో  తమ రాజకీయ ప్రత్యర్థులు నేరాలు చేశారని సాక్ష్యాలు సమర్పిస్తూ ఉంటారు. వీటిని పరిశీలించి కోర్టులు కేసులు నమోదుచేయాలని ఆదేశిస్తూంటాయి. అలాగే రాజకీయ నేతల ఫిర్యాదుల మేరకు పోలీసులూ కేసులు నమోదు చేస్తూంటారు. అయితే రాజకీయ కారణాలతో తమపై కక్ష సాధింపు కోసం ఇలా కేసులు నమోదు చేస్తున్నారని.. వాటిని కొట్టి వేయాలని చాలా మంది ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇలాంటి వారందరికి సుప్రీంకోర్టు తీర్పు ఇబ్బందికరమేనని భావిస్తున్నారు.