గత రెండు నెలల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు తగలబడిపోయిన ఘటనలు మనం ఎన్నోసార్లు చూశాం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీటిపై సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు ఒక ప్రత్యేక కమిటీని నియమిస్తామని... అవకతవకలు జరిగినట్లు తెలిస్తే భారీ జరిమానాలతో పాటు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


‘ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో గత రెండు నెలల్లో జరిగిన ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడం, కొంతమంది గాయాల పాలవడం దురదృష్టకరం. ఈ ఘటనలపై నిపుణులతో ఒక కమిటీని నియమించాం. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కావాల్సిన సిఫారసులను ఆ కమిటీ అందిస్తుంది.’ అని గడ్కరీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యత విషయంలో కొత్త నియమాలు రూపొందిస్తామని, అలాగే లోపాలున్న వాహనాలను ఆయా కంపెనీలు వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏయే కంపెనీల వాహనాల్లో అయితే సమస్యలు తలెత్తాయో... ఆయా కంపెనీలకు నోటీసులు పంపించామని తెలిపారు.


ఏ కంపెనీ అయినా వాహనాల తయారీలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలిస్తే... వారికి జరిమానా విధించడంతో పాటు లోపాలున్న వాహనాలన్నీ వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయంలో కంపెనీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ద్విచక్ర వాహనం నడిపేవారి భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు.


















Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?