సహజీవనం వల్ల లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రతీ ఒక్కరికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నాయి. అయితే ఇందులో సహజీవనం ఉండటం ఆందోళనకరమని జస్టిస్‌ సుబోధ్‌ అభ్యంకర్‌ వ్యాఖ్యానించారు. ఇది సమాజంలో నీతిని పాడు చేస్తోందన్నారు.  మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపించిన 25 ఏళ్ల యువకుడి ముందస్తు అరెస్టు (యాంసిపేటరీ) బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ హైకోర్టు ఇండోర్ బెంచ్‌లోని జస్టిస్ సుబోధ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో సహజీవనం వల్ల పెరుగుతున్న నేరాలను పరిగణనలోకి తీసుకుంటే లివ్ ఇన్ రిలేషన్ నిషేదంపై ఆలోచించాల్సి వస్తోందని జస్టిస్ పేర్కొన్నారు.


భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులు, భారత్‌లో కరోనా ఫోర్త్ వేవ్‌కు సంకేతమా !


హైకోర్టు ముందుకు వచ్చిన కేసులో మహిళ రెండు సార్లు గర్బం దాల్చింది. అయితే సహజీవనంలో ఉన్న వ్యక్తి ఒత్తిడి కారణంగా అబార్షన్ చేయించుకుంది. వారు విడిపోయాక ఆ మహిళ మరొకరితో నిశ్చితార్థం చేసుకుంది. అయితే సహజీవనం చేసిన వ్యక్తి .. ఆమెను వదిలి పెట్టకుండా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆమె కాబోయే అత్తమామలకు తాము సన్నిహితంగా వీడియోలు పంపాడు. దీంతో ఆ మహిళ వివాహం రద్దు అయింది. ఈ కారణంగా తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ కేసు పెట్టింది. అయితే సహజీవనంలో ఉన్న జంట మధ్య లైంగిక సంబంధాలు రేప్ కిందకు రావని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. అయితే సహజీవనం విఫలమైన తర్వాత ఏర్పడుతున్న పరిస్థితుల వల్ల ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు.  


జాగ్రత్త పడిన యోగి ఆదిత్యనాథ్- ఊరేగింపులకు ఇక అనుమతి తప్పనిసరి
 
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్చ ఉన్నాయి. అయితే ఇలాంటి స్వేచ్చ దుర్వినియోగం కావడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. నిజానికి సహజీవనం అభినృద్ధి చెందిన దేశాల్లో అన్నీ అవగాహనఉన్నప్రజలు పాటించే విధానం. కానీ భారత దేశం వంటి చోట్ల అది అనేక సమస్యలకు కారణం అవుతుందన్న ఆందోళన ఉంది. కానీ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్చ ఉండటంతో సహజీవనంపై ఎలాంటి ఆంక్షలు లేవు. అందుకే దేశంలో పెళ్లి కాకుండానే కలిసి ఉండే యువ జంటల సంఖ్య పెరుగుతోంది. దాంతో పాటువాటి వల్ల ఏర్పడే సమస్యలతో  కేసులు కూడా పెరుగుతున్నాయి.