Covid Update:


దేశంలో కొత్తగా 3,207 కరోనా కేసులు నమోదుకాగా 29 మంది మృతి చెందారు. 3,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.






మొత్తం కేసుల సంఖ్య 4,31,05,401కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 20,403గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.05గా ఉంది.


రికవరీ రేటు 98.74గా ఉంది. డైలీ కొవిడ్ పాజిటివిటీ రేటు 0.95గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.85గా ఉంది.



  • మొత్తం కరోనా కేసులు: 4,31,05,401

  • మొత్తం మరణాలు: 5,24,093

  • యాక్టివ్​ కేసులు: 20,403

  • కోలుకున్నవారి సంఖ్య: 4,25,60,905


వ్యాక్సినేషన్







తాజాగా 13,50,622 మందికి కరోనా టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,90,34,90,396కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల 36 వేలకుపైగా కరోనా టెస్టులు నిర్వహించింది కేంద్రం.


మహారాష్ట్ర


మహారాష్ట్రలో కొత్తగా 224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనాతో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 78,79,278కి చేరింది. మరణాల సంఖ్య 1,47,847కు పెరిగింది. ఒక్క ముంబయిలోనే కొత్తగా 123 కరోనా కేసులు వచ్చాయి.


Also Read: Loudspeaker Row: కర్ణాటకలో హై అలర్ట్- 'హనుమాన్ చాలీసా vs అజాన్'- పోలీసులు పరేషాన్!


Also Read: UP: ఆ పథకం అమలులో తెలంగాణ టాప్- ఉత్తర్‌ప్రదేశ్‌ అట్టర్ ఫ్లాప్- అట్లుంటది మనతోని!