UP: 'హర్ ఘర్ జల్' (ఇంటింటికి నీళ్లు) పథకం.. 2019లో వచ్చింది. ఈ పథకం కింద దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి 2024 నాటికి తాగు నీరు అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మరి మూడేళ్లలో ఈ పథకం ఎంత వరకు లక్ష్యానికి చేరువైంది. అసలు ఎన్ని ఇళ్లకు నీరు అందుతోంది? వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్ని ఇళ్లకు నీరు అందుతోంది? 

యూపీలో 

ఈ పథకం కింద ఉత్తర్‌ప్రదేశ్‌లో కేవలం 14 శాతం గ్రామీణ నివాసాలకు మాత్రమే నల్లా నీరు అందుతోంది. హర్ ఘర్ జల్ యోజనలో ఉత్తర్‌ప్రదేశ్‌ చివరి నుంచి మొదటి స్థానంలో నిలిచింది.

2022 మే 5 నాటికి ఉత్తర్‌ప్రదేశ్‌లో కేవలం 14 శాతం ఇళ్లకే (గ్రామీణ) కుళాయి నీరు అందుతోంది. మిగిలిన 2.28 కోట్ల కుటుంబాలు ఇతర మార్గాల ద్వారా తాగు నీరు కోసం తంటాలు పడుతున్నారు. దేశంలో నల్లా కనక్షన్లు లేని అత్యధిక గ్రామీణ కుటుంబాలు యూపీలోనే ఉన్నాయి.

మరో నాలుగు

ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాలలో 25 శాతం కంటే తక్కువ మందికే నల్లా కనక్షన్లు ఉన్నాయి.

Source: Jal Jeevan Mission - Har Ghar Jal (May 5, 2022)

రాష్ట్రం

మొత్తం కుటుంబాలు

నల్లా కనక్షన్లు ఉన్నవి

 శాతం

ఉత్తర్‌ప్రదేశ్

2,64,27,705

35,86,230

14%

ఝార్ఖండ్

59,23,320

11,69,500

20%

ఛత్తీస్‌గఢ

48,59,443

10,82,180

22%

బంగాల్ 

1,77,22,587

40,18,736

23%

రాజస్థాన్ 

1,05,68,805

25,68,076

24%

Source: జల్‌ జీవన్ మిషన్- హర్‌ ఘర్ జల్ (2022, మే 5)

స్కీం ఉద్దేశం

2019 ఆగస్టు – రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ జల్‌ జీవన్ మిషన్ (JJM)- హర్‌ ఘర్ జల్ పథకం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి 2024 లోపు తాగు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

25-50 శాతం

రాష్ట్రం

మొత్తం ఇళ్లు

తాగు నీరు అందుతున్నవి

శాతం

అసోం

63,35,015

23,75,604

38%

మేఘాలయ

5,89,888

2,31,489

39%

మధ్యప్రదేశ్

1,22,27,867

49,29,962

40%

కేరళ

70,68,652

28,62,745

41%

నాగాలాండ్

3,77,286

1,59,438

42%

తమిళనాడు

1,26,89,045

54,33,578

43%

Odisha

88,33,536

41,21,164

47%

Karnataka

97,91,513

48,26,942

49%

Source: జల్‌ జీవన్ మిషన్- హర్‌ ఘర్ జల్ (2022, మే 5)

100 శాతం

తెలంగాణ, గోవా, హరియాణా రాష్ట్రాలు మాత్రమే ఈ పథకం కింద 100 శాతం గ్రామీణ కుటుంబాలకు నీళ్లు అందిస్తున్నాయి.

90 శాతం

పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు 90 శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు నల్లా ద్వారా నీళ్లు అందిస్తున్నాయి.

Source: Jal Jeevan Mission - Har Ghar Jal (May 5, 2022)