J&K Encounter: జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిద్దరూ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.






ఇలా జరిగింది


ఉగ్రవాదుల సంచారంపై పక్కా సమాచారంతో కుల్గాం జిల్లాలో ఆదివారం ఉదయం తెల్లవారుజామున భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇది గమనించిన ఉగ్రవాదులు.. చెయాన్‌ దేవ్‌సర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలపైకి జరిపారు.






దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని పాకిస్థాన్ ఉగ్రవాది హైదర్‌గా గుర్తించినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) విజయ్ కుమార్ తెలిపారు. హైదర్‌ రెండేళ్లుగా ఉత్తర కశ్మీర్‌లో యాక్టివ్‌గా ఉన్నాడని, అనేక నేరాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.


ఇటీవల


జమ్ముకశ్మీర్ అనంతనాగ్​ జిల్లా పహల్గాం అటీవీ ప్రాంతంలో మే 6న భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. ముష్కరులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో నిర్భంద తనిఖీలు నిర్వహించాయి బలగాలు. వీరిని చూసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థకు ముగ్గురు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో అశ్రఫ్​ మోల్పీ అనే పాత తీవ్రవాది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


Also Read: UP: ఆ పథకం అమలులో తెలంగాణ టాప్- ఉత్తర్‌ప్రదేశ్‌ అట్టర్ ఫ్లాప్- అట్లుంటది మనతోని!


Also Read: Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో మారణకాండ- పాఠశాలపై బాంబు దాడి- 60 మంది మృతి