Corona Cases India: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గింది. అయితే మాస్కులు ధరించడం, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, భౌతికదూరం లాంటివి పాటించకపోతే కరోనా నాలుగో వేవ్ త్వరలోనే వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా, దక్షిణ కొరియా సహా పలు దేశాలు కరోనా సమస్యలతో విలవిల్లాడుతున్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,761 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 127 మంది కొవిడ్ 19తో పోరాడుతూ చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. 


ముంబైలో కరోనా మరణాలు 0  
ముంబైలో తాజాగా 29 కరోనా కేసులు (Corona Cases In Mumbai) నమోదు కాగా, ఒక్క కొవిడ్ మరణం సైతం నమోదుక అవకపోవడం శుభపరిణామం. నగరంలో యాక్టివ్ కేసులు 315 ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు కిందటి రోజుతో పోల్చితే భారీగానే తగ్గాయి. కొవిడ్ మరణాలు కిందటి రోజుతో పోల్చితే పెరిగాయి. దేశంలో మొత్తం కరోనా మరణాలు 5,16,479కు చేరుకున్నాయి. శనివారం నాడు 3,196 మంది కోలుకోవడంతో, భారత్‌లో కరోనా రికవరీల సంఖ్య 4 కోట్ల 24 లక్షల 64 వేలకు పెరిగింది.







దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా 61 మందికి కరోనా సోకింది. దీంతో ఇక్కడ మొత్తం కరోనా బాధితుల సంఖ్య  18 లక్షల 63 వేల 694 (18,63,694)కు చేరుకుంది. నిన్న డిల్లీలో ఒక్క కొవిడ్ మరణం నమోదైంది. ఇప్పటివరకూ మొత్తం 26,146 మంది ఢిల్లీలో కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయారు.


దేశంలో కరోనా రికవరీ రేటు 98.8 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు కేవలం 0.06 శాతానికి పడిపోయాయి. ఇప్పటివరకూ భారత్‌లో 181 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయింది. కరోనా మరణాలు ఒకరోజు తగ్గుతున్నా, మరుసటి రోజు అంతకు రెట్టింపు కొవిడ్19 మరణాలు నమోదవుతున్నాయని వైద్య శాఖ దానిపై ఫోకస్ చేసింది. గత కొన్ని రోజులుగా కేవలం 2,500 లోపే పాజిటివ్ కేసులు వస్తున్నాయి.  


Also Read: Foods for Sleep: రాత్రి పూట ఈ ఆహారాలు తింటే హాయిగా నిద్ర పట్టేయడం ఖాయం


Also Read: అస్సాంలోని ఓ టీ పొడికి ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు, త్వరలో ఆన్‌లైన్లో అమ్మకానికి