ఉక్రెయిన్ - రష్యా యుద్ధం మొదలవ్వకముందు వరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరో కూడా ఎన్నో దేశాల ప్రజలకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన పేరు మారుమోగిపోతోంది. రష్యాలాంటి పెద్ద దేశం ఆగకుండా దాడులు చేస్తున్నా, జెలెన్ స్కీ, అతడి కుటుంబాన్ని చంపేందుకు సైన్యాన్ని దించినా కూడా ఆయన వెన్ను చూపడం లేదు. ఎన్నో దేశాలు తాము ఆశ్రయం ఇస్తామని, కుటుంబంతో పాటూ వచ్చేయని ఆఫర్ ఇచ్చినా కూడా జెలెన్ స్కీ పారిపోలేదు. దేశంలోనే భార్యా బిడ్డలతో ఉంటూ సైన్యాన్ని యుద్ధంలో ముందుకు నడిపిస్తున్నాడు. తాను కావాలనుకుంటే యుద్ధాన్ని, దేశాన్ని,ప్రజలను వదిలి పారిపోవచ్చు. కానీ ధీరుడిలా యుద్ధభూమిలోనే ఉంటున్నాడు. అందుకే అతడు ప్రపంచానికి నచ్చాడు.ఎంతో మంది ప్రజలకు నచ్చాడు. మనదేశంలో కూడా అతడికి అభిమానులు ఎక్కువే. అసోంలో అయితే ఇప్పుడు అతని మారుమోగిపోతోంది. కారణం అతడి పేరుతో ఓ టీ మార్కెట్లోకి వచ్చింది. 


అతడి గౌరవార్థం...
అసోంలోని ఓ టీ కంపెనీ పేరు ‘అరోమికా’. వారు బ్లాక్ టీ బ్రాండ్ ను మార్కెట్లో దించారు. దానికి ఓ పేరు పెట్టాలి. బాగా ఆలోచించి ‘జెలెన్ స్కీ’ అని పెట్టారు. ‘నిజంగా స్ట్రాంగ్’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. నిజమే పెద్ద దేశంతో వెనకడుగు వేయకుండా పోరాడులున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నిజంగా స్ట్రాంగే కదా. అందుకే ఆయన్ను దృష్టిలో పెట్టుకునే తమ కొత్త టీ పొడికి ఆ పేరు పెట్టారు. జెలెన్ స్కీ ధీరత్వానికి, వ్యక్తిత్వానికి ఇది తాము ఇస్తున్న గౌరవంగా చెప్పారు ఆ టీ కంపెనీ యజమాని రంజిత్ బారువా. జెలెన్ స్కీ వ్యక్తిత్వాన్ని తమ టీకి ఆపాదించామని, త్వలరో ఈ టీ పొడి ఆన్ లైన్ లో అమ్మకానికి పెడుతున్నట్టు చెప్పారు. దేశంలో ఎవరైనా ఈ టీ పొడిని కొనుక్కోవచ్చన్నమాట. అసోంలో అయితే అమ్మకాలు బాగానే జరుగుతున్నాయి. 


మన టీ ఉక్రెయిన్‌కు
యుద్ధం రాకముందు ఉక్రెయిన్ మనదేశం నుంచి ప్రతి ఏడాది టీపొడిని దిగుమతి చేసుకుంటుంది. ఈ ఏడాది కూడా 1.73 మిలియన్ల టీ పొడిని దిగుమతి చేసుకుంది. ఇక ఇప్పుడు యుద్ధపరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో, ఆ దేశ ఆర్ధిక పరిస్థితి ఎన్నాళ్లకు చక్కబడుతుందో తెలియదు. చెల్లాచెదురైన ప్రజలు మళ్లీ సొంతగూళ్లకు ఎప్పుడు చేరుతారో కూడా అంచనా వేయలేం. ఎన్నో నెలలు తరువాతే మళ్లీ మన టీ ఉక్రెయిన్ చేరుతుంది. 





Also read: ఎవరికైనా హార్ట్ ఎటాక్ వస్తే ముందుగా చేయాల్సిన పని ఇదే


Also read: వంకాయ కూర తింటే అది బాగా పని చేస్తుందట, మీ పిల్లలకు తిరిగే ఉండదు