సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యం అందుబాటులో ఉండే కూరగాయల్లో వంకాయలు ముందుంటాయి. నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు, బెంగళూరు వంకాయలు ఇలా వంకాయల్లో వివిధ రకాలు ఉన్నాయి. వాటిలో ఏవి తిన్నా మంచివే. కానీ వంకాయ కూర పేరు చెప్పగానే ముఖం మాడ్చేసే వాళ్లు ఎంతో మంది. వంకాయ పూర్తిగా తినడం మానేసిన వారు కూడా ఎక్కువే. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు వంకాయను భేషుగ్గా తినవచ్చు. వీటిని తినడం మానేయడం వల్ల మీకే నష్టం. ఈ కూరగాయలో కూడా ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. వారానికి కనీసం ఒక్కసారైనా వంకాయ కూర తినేందుకు ప్రయత్నించండి. కూర నచ్చకపోతే వీటితో బిర్యానీలు కూడా చేసుకుంటారు. వాంగీ బాత్ వంటి రైస్ ఐటెమ్స్ కూడా ప్రయత్నించవచ్చు. వంకాయ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 


లాభాలివిగో...
1.గ్యాస్, కీళ్ల నొప్పులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువే. ఆ సమస్యలు ఉన్నవారు కచ్చితంగా వంకాయను తినాలి. వంకాయలోని సుగుణాలు ఆ సమస్యలు ఉన్నవారికి మేలు చేస్తాయి. ఉపశమనం కలిగిస్తాయి.
2. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  గుండె ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్లు చాలా అవసరం. ఎన్నో వ్యాధులు రాకుండా కూడా ఇవి అడ్డుకుంటాయి. అంతే కాదు ఇందులో అనేక రకాల సమ్మేళనాలు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. 
3. ఈ కూరగాయల్లో ఫైటో న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. బ్రెయిన్ పనితీరును మెరుగుపరచడంలో ముందుంటాయి ఫైటో న్యూట్రియెంట్స్. మెదడులో కణితులు ఏర్పడకుండా కాపాడడంలో వంకాయలు ముందుంటాయి.  4. కాలిన గాయాలు ఉన్నప్పుడు వంకాయలతో వండిన ఆహారాన్ని అధికంగా తినాలి. వంకాయల వల్ల దురద కలుగుతుందని పుండ్లు, ఇన్ఫెక్లన్ల సమయంలో వంకాయ తినరు. కానీ వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు వాటిని త్వరగా మానిపోయేలా చేస్తాయి. అందుకే కొంచెమైనా తింటే మంచిది. 
5. గర్భిణిలకు అన్ని రకాల ఆహారాలను ప్రత్యేకంగా పెడతారు. కానీ వంకాయకు మాత్రం చివరి స్థానం ఇస్తారు. వాటిని తినడం వల్ల ఏం ఉపయోగంలే అనుకుంటారు. కానీ వంకాయను కూడా గర్భిణిలకు తినపించాలి. ఇందులో ఉండే ఎన్నో పోషకాలు బిడ్డకు అందుతాయి. 
6. బరువు తగ్గాలనుకునేవారికి వంకాయలు చాలా సహకరిస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అధికంగా ఆకలి వేయడాన్ని నిరోధిస్తుంది. దీంతో ఆహారం తినాలన్న కోరిక పుట్టదు. అలా ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వారంలో రెండు మూడు సార్లు వంకాయతో చేసిన వంటలు తినడం ఉత్తమం. 






Also read: ముఖం కాలిపోయింది, గుండె జబ్బు వేధిస్తోంది, అయినా మిస్ వరల్డ్ పోటీల్లో నిలిచి గెలిచింది