మీరే తింటారో అదే మీ నిద్రను నిర్ణయిస్తుంది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. కొన్ని రకాల ఆహారాలు రాత్రి బాగా నిద్రపట్టేలా చేస్తే, మరొకొన్ని మాత్రం నిద్రను రాకుండా అడ్డుకుంటాయి. ప్రస్తుత కథనంలో నిద్ర పట్టేందుకు ఎలాంటి ఆహారాలు రాత్రి పూట తినాలో తెలుసుకుందాం. 


అన్నం
బియ్యంతో వండిన వంటకాలు, బంగాళాదుంపలు వంటి తక్కువ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు కలిగి ఆహారాలు రాత్రిపూట తినాలి. ఇవి నిద్రా సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇవి సెరోటోనిన్, మెలటోనినన్ వంటి హార్మోన్లను ప్రేరేపిస్తాయి. వీటి వల్ల నిద్ర ముంచుకొస్తుంది. రాత్రిపూట తరచూ తెలివి రాకుండా ఉంటుంది. 


మాంసాహారం
మాంసాహారం శరీరంలో ప్రొటీన్ స్థాయిలను పెంచెందేకు సహకరిస్తుంది. వీటిని కాస్త తిన్నా కూడా పొట్ట నిండుగా అనిపిస్తుంది. దీని వల్ల నిద్ర చక్కగా పడుతుంది. మాంసాహారంలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి మన న్యూరో ట్రాన్స్మీటర్లను రిపేర్ చేస్తాయి. అందుకే మాంసాహారం తిన్నాక హాయిగా నిద్రపడుతుంది. 


బోన్ సూప్ 
చికెన్, మటన్ ఎముకలతో చేసే సూప్ చాలా ఆరోగ్యకరం. ఇందులో ఉండే గ్లైసిన్, అమైనో ఆమ్లాలు మెదడు ప్రశాంతంగా ఉండేలా చూస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరగకుండా చూస్తాయి. నిద్ర చక్కగా పట్టేలా చేస్తాయి. 


గసగసాలు, జాజికాయ
వంటల్లో గసగసాలు, జాజికాయల్ని భాగం చేసుకోవాలి. ఇవి నిద్ర సమస్యలను దూరం చేసేందుకు సహకరిస్తాయి. ఆయుర్వేదంలోని చాలా ఔషధాల తయారీలో కూడా వీటిని వాడతారు. వీటిని రాత్రి పై వండే వంటల్లో కలిపితే మంచిది. ఇవి ఒత్తిడి స్థాయిలను తగ్గించి చక్కటి నిద్రను అందిస్తాయి. 


నిద్రను డిస్టర్బ్ చేసేవి ఇవే
నిద్రనే తెప్పించేవే కాదు, నాశనం చేసేవి కూడా ఉంటాయి. ధూమపానం, మద్యపానం వంటివి నిద్ర సైకిల్ ను చాలా డిస్టర్బ్ చేస్తాయి. అలాగే  రాత్రి పూట అధిక కారం వేసిన ఆహారాలను తినకూడదు. ఉప్పు అధికంగా వేసే ఆహారాలై చిప్స్ వంటివి కూడా దూరం పెట్టాలి. రాత్రిపూట జంక్ ఫుడ్ ను ముట్ట కూడదు. అధిక ప్రాసెస్ చేసిన ఆహారం నిద్రను రాకుండా అడ్డుకుంటుంది. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: అస్సాంలోని ఓ టీ పొడికి ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు, త్వరలో ఆన్‌లైన్లో అమ్మకానికి


Also read: ఎవరికైనా హార్ట్ ఎటాక్ వస్తే ముందుగా చేయాల్సిన పని ఇదే