Cable Car Mishap: హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఎత్తైన ప్రాంతంలో రోప్‌ వేపై ఒక కేబుల్‌ కార్‌ నిలిచిపోయింది. దీంతో అందులో చిక్కుకున్న 10 మందికి పైగా పర్యటకులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సహాయక సిబ్బంది.






ఏం జరిగింది?


పర్వానూలోని టింబర్‌ ట్రెయిల్‌ ప్రైవేట్‌ రిసార్ట్‌కు చెందిన రోప్‌ వేపై వెళ్లే కేబుల్‌ కార్ చాలా ఫేమస్. సోమవారం మధ్యాహ్నం 11 మంది పర్యాటకులు ఉన్న కేబుల్‌ కార్‌ ఎత్తైన కొండ ప్రాంతంలో రోప్‌ వేపై నిలిచిపోయింది. సాంకేతిక సమస్య వల్ల అది ఎంతకీ ముందుకు కదలలేదు. దీంతో అందులో ఉన్న 11 మంది పర్యాటకులు గంటన్నర వరకు చిక్కుకుపోయారు.


ఇందులో ఇద్దరు వృద్ధులు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు. భయాందోళన చెందిన వారంతా సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. మరోవైపు సహాయక బృందం మరో రోప్‌ వేపై ఆ కేబుల్‌ కార్‌ వద్దకు చేరింది. అయితే అది కదలలేని పరిస్థితిలో ఉండటంతో చివరకు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు.


ఎట్టకేలకు






ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా అక్కడకు చేరుకున్నారు. రోప్‌ వేపై చిక్కుకున్న కేబుల్‌ కార్‌లోని ఇద్దరిని సురక్షితంగా తాళ్ల సహాయంతో కిందకు దించి రక్షించారు. అందులోని ఉన్న మిగతా 9 మందిని కూడా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.


Also Read: CM Stalin: ముఖ్యమంత్రికి అస్వస్థత- అధికారిక కార్యక్రమాలు రద్దు


Also Read: Agnipath Recruitment Notification 2022: అగ్నిపథ్‌ నియామకాల్లో కేంద్రం దూకుడు- కీలక నోటిఫికేషన్ విడుదల