Bharat Bandh Over Agnipath Scheme: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సోమవారం చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర సంస్థలు, రైల్వే స్టేషన్ల వద్ద రైల్వే రక్షక దళం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
భారీగా ట్రాఫిక్ జామ్
దిల్లీ- గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారత్ బంద్ కారణంగా దిల్లీ పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.
పరీక్షలు వాయిదా
అగ్నిపథ్ పథకానికి నిరసనగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) ఝార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఝార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర‍్ణయం తీసుకుంది. సోమవారం ఝార్ఖండ్‌లోని అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలను కూడా వాయిదా వేశారు.
144 సెక్షన్
బిహార్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు జరిగిన కారణంగా 20 జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. నోయిడాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పంజాబ్‌లో కూడా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పోలీసుల అలర్ట్ ప్రకటించారు. యూపీలోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.
Also Read: National Herald case: నాలుగోసారి ఈడీ ముందుకు రాహుల్ గాంధీ- దిల్లీలో కాంగ్రెస్ సత్యాగ్రహం
Also Read: Lightning Strikes in Bihar: పిడుగుపాటుకు 17 మంది మృతి - రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం