Lightning Strikes in Bihar: బిహార్‌లో పిడుగుపాటుకు 17 మంది వరకు మృతి చెందారు. శనివారం రాత్రి నుంచి బిహార్ రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపలతో భారీ వర్షాలు కురిశాయి. 


ఆ జిల్లాల్లో


భాగల్పుర్ జిల్లాలో గరిష్ఠంగా పిడుగుపాటుకు ఆరుగురు మరణించారు. వైశాలి జిల్లాలో ముగ్గురు, కతిహార్, మాధేపురా, బంకా, ఖగారియా,ముంగేర్, సహర్సా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాటుకు మృతి చెందారు.


బిహార్‌ రాష్ట్రంలో గత ఏడాది కూడా పిడుగు పాటుకు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.


నితీశ్ సంతాపం










పిడుగులు పడి 17 మంది మృతి చెందడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. పిడుగుపాటుకు మరణించిన ప్రతి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం సీఎం నితీశ్ ప్రకటించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు.


Also Read: Jammu Kashmir Encounter: కాల్పులతో దద్దరిల్లిన కశ్మీర్- 24 గంటల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతం


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12 వేలకు పైగా కరోనా కేసులు- 18 మంది మృతి