Jammu Kashmir Encounter:  కశ్మీర్‌ కాల్పులతో దద్దరిల్లింది. జమ్ముకశ్మీర్‌లో జరిగిన 3 వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు కాగా మరో నలుగురు స్థానికులని పోలీసులు తెలిపారు.


ఇదీ జరిగింది




కుప్వారాలో ఉగ్రవాదుల నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో బలగాలు, పోలీసులు సంయుక్త సెర్చ్ ఆపరేషన్ చేశాయి. బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆదివారం ఇద్దురు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం ఉదయం మరో పాకిస్థానీ ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. సోపియాన్‌ ప్రాంతంలోని ఓ స్థానిక ఉగ్రవా.ది కూడా ఇందులో ఉన్నారు. మృతి చెందిన వారిలో ఉగ్రవాది షోకత్ అహ్మద్ షేక్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలో ఉగ్రవాది షోకత్ అహ్మద్ షేక్ గురించి సమాచారం అందుకున్న ఆర్మీ 28ఆర్ఆర్‌తో పాటు కుప్వారా పోలీసులు గాలింపు ప్రారంభించారు. గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా, భద్రతా జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. 


మరో రెండు చోట్ల


పుల్వామాలో లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని బలగాలు హతమార్చాయి. కుల్గాంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ తరఫున పని చేస్తోన్న ఓ స్థానిక ఉగ్రవాది సహా ఒక లష్కరే తోయిబా ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. దీంతో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.






ఎన్‌కౌంటర్ జరిగిన కుప్వారాలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2022లో ఇప్పటి వరకు 32 మంది పాకిస్థానీలతో సహా 110 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12 వేలకు పైగా కరోనా కేసులు- 18 మంది మృతి


Also Read: Agnipath protests: అగ్నివీరులకు మేం ఉద్యోగాలిస్తాం, కార్పొరేట్‌ రంగానికి కావాల్సింది వాళ్లే-ఆనంద్ మహీంద్రా ట్వీట్