Corona Cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 12,781 కరోనా కేసులు నమోదయ్యాయి. 18 మంది మృతి చెందారు. 8,537 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి చేరింది. మరణాల రేటు 1.21 శాతంగా ఉంది.






మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.17 శాతంగా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది.



  • మొత్తం కరోనా కేసులు: 43,309,473

  • మొత్తం మరణాలు: 5,24,873

  • యాక్టివ్​ కేసులు: 76,700

  • మొత్తం రికవరీలు: 4,27,07,900


వ్యాక్సినేషన్







దేశంలో కొత్తగా 2,80,136 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,18,66,707 కోట్లకు చేరింది. మరో 2,96,050 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.


కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పగా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. 


Also Read: Agnipath protests: అగ్నివీరులకు మేం ఉద్యోగాలిస్తాం, కార్పొరేట్‌ రంగానికి కావాల్సింది వాళ్లే-ఆనంద్ మహీంద్రా ట్వీట్


Also Read: Jammu Kashmir: కశ్మీర్‌లో ఇకపై ఆ స్కూల్స్ కనిపించవు, బ్యాన్ చేసిన కేంద్రం