Agnipath Recruitment Notification 2022: అగ్నిపథ్ పథకంపై కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతోన్న వేళ కేంద్రం దూకుడు పెంచింది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు నోటిషికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు ఎయిర్‌ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది.
ఇండియన్ ఆర్మీలో అగ్నివీరులుగా చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మంగళవారం నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఆర్మీ నోటిఫికేషన్ నేడు విడుదల కాగా ఈనెల 24న ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది.
నిరసనల కారణంగా
ఈ పథకంపై పెద్ద ఎత్తున నిరసన రావడంతో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. 'అగ్నిపథ్' పథకంలో భాగంగా ఆర్మీలో చేరి సేవలు అందించనున్న అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇందులో చేరేందుకు గరిష్ట వయో పరిమితి 23కి చేరింది. పదిహేడున్నరేళ్ల నుంచి 23 సంవత్సరాల వయసుగల వారిని త్రివిధ దళాల్లో అగ్నివీరులుగా నియమిస్తారు. అగ్నిపథ్ పథకాన్ని గతంలో 'టూర్ ఆఫ్ డ్యూటీ'గా పిలిచేవారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించారు.
నాలుగేళ్ల సర్వీస్
ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళ సైనిక సేవలు రిక్రూట్‌మెంట్ వ్యవస్థలో కేంద్ర రక్షణశాఖ విప్లవాత్మక మార్పులు తీసుకోస్తుంది. కొత్తగా ప్రతిపాదించిన మార్పుల ప్రకారం రిక్రూట్ చేసిన సైనికులందరూ 4 సంవత్సరాల తర్వాత సర్వీస్ నుండి విడుదల అవుతారు. అంతే కాదు సర్వీస్ నుంచి రిలీజ్ అయిన వారిలో కొంత మందిని పూర్తి సేవల కోసం తిరిగి చేర్చుకోవడం తప్పనిసరి. ఈ మార్పులను టూర్ ఆఫ్ డ్యూటీ/అగ్నీపథ్ పథకం (Agneepath Recruitment Scheme)లో భాగంగా చేపట్టబోతున్నారు.
Also Read: US Mass Shooting: అమెరికా ఇక మారదా? ఈసారి వైట్ హౌస్ సమీపంలోనే కాల్పులు!
Also Read: Bharat Bandh Over Agnipath Scheme: భారత్ బంద్ ఎఫెక్ట్- రాజధాని ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్