US Mass Shooting: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలకు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. తాజాగా వాషింగ్టన్‌లో సోమవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందాడు. వైట్ హౌస్‌కు సమీపంలోనే ఈ కాల్పులు జరిగాయి.






ఇదీ జరిగింది


వాష్టింగన్‌ డీసీలోని 14వ, యూస్ట్రీట్‌ నార్త్‌వెస్ట్‌లో ఓ సంగీత కచేరి కార‍్యక్రమంలో ఈ కాల్పులు జరిగాయి. ఇది వైట్‌ హౌస్‌కు కేవలం రెండు మైళ్ల దూరంలో ఉంది. ఈ కాల్పుల భయంతో ఒక్కసారిగా రోడ్లపై జనం పరుగులు తీశారు. అయితే కాల్పులు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందగా, అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి.


వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అయితే కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది. 


మే నెలలో


మే చివరి వారంలో టెక్సాస్ కాల్పులతో దద్దరిల్లింది. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా మొత్తం 21 మంది మరణించారు. అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని ఓ ప్రైమరీ స్కూలులో ఓ టీనేజర్ కాల్పులు జరిపాడు. పాఠశాలలో ఉన్న 18 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.


అమెరికాలో కాల్పుల ఘటనలు అధికం కావడం వల్ల తుపాకీ నియంత్రణ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల​ తెలిపారు. 18-21 ఏళ్ల మధ్య వయసున్న వారు తుపాకులు కొనుగోలు చేయకుండా చట్టాన్ని రూపొందించారు. 


Also Read: Bharat Bandh Over Agnipath Scheme: భారత్ బంద్ ఎఫెక్ట్- రాజధాని ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్


Also Read: National Herald case: నాలుగోసారి ఈడీ ముందుకు రాహుల్ గాంధీ- దిల్లీలో కాంగ్రెస్ సత్యాగ్రహం