ఉత్తరప్రదేశ్‌లోని ( UP ) ఔరారియా అనే ఊళ్లో నవోదయ విద్యాలయం ( Navodya School ) ఉంది. విద్యాలయం అన్నాక.. విద్యార్థులు.. విద్యార్థినీలు ఉంటారు. ప్రిన్సిపాల్ కూడా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే సమస్యలో ముగ్గురూ ఉన్నారు. ప్రిన్సిపాల్‌కు ఏడో తరగతి విద్యార్థులు అంటే... అచ్చంగా అబ్బాయిల ( 7Th Class Students ) నుంచి ఓ లేఖ వచ్చింది. ఆ లేఖలో ఏముందంటే.. క్లాసులో అమ్మాయిలందరూ తమకు నిక్ నేమ్స్ పెట్టి వాటితో పిలుస్తున్నారని.. భరించలేకపోతున్నామని వారు ఆ లేఖ ( Students Letter ) ద్వారా ఫిర్యాదు చేశారు.
ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణకు కేంద్ర మంత్రి సపోర్ట్ - కానీ ట్రంపే వద్దంటున్నారు !
ఇంతకీ అమ్మాయిలు ..క్లాస్ మేట్స్ ( Class Mates ) అయిన అబ్బాయిలకు పెట్టిన పేర్లేమిటంటే... ఒకరికేమో లల్లా ( Lalla ) అని పెట్టారట. అంటే పెద్దగా బుర్ర ఎదగలేదని చెప్పడానికి ఈ పదం వాడతారు. ఇంకొకరికి రసగుల్లా ( Rasagulla ) అనిపెట్టారు. ఇంకొకరికి దామర్ అని పెట్టారు. ఇది రోడ్ నిర్మాణంలో వాడే రోడ్డు రోలర్ లాంటిది. ఇలాంటి నిక్ నేమ్స్ పెట్టి పిలవడం వల్ల తాము తట్టుకోలేకపోతున్నామని ఆ అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని లెటర్‌లో విద్యార్థులు కోరారు. ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
భార్యపై బలవంతపు శృంగారంపై దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?
పిల్లలే కదా అని కామెడీగా తీసుకోలేదు.. స్కూల్ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుని వారి తల్లిదండ్రులను ( Parents ) పిలింపించింది. అమ్మాయిలతో పాటు అబ్బాయిల తల్లిదండ్రులను కూడా పిలిపించారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాంటి లెటర్లు ( Letters ) రాసిన అమ్మాయిలకూ పద్దతుల గురించి చెప్పారు. ఆ సమస్య అంతటితో పరిష్కారం అయిందని.. ఇప్పుడు రెండు వైపులా ఎలాంటి కంప్లయింట్స్ ( No Complaints ) లేవని స్కూల్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ సమస్య ఇలా పరిష్కారమయిందని సంతోషపడాలో... ఆరు, ఏడో తరగతుల్లో నిక్ నేమ్స్ పెట్టి అబ్బాయిల్ని అడపిల్లలు ర్యాగింగ్ ( Ragging ) చేసే స్థాయికి వెళ్లారని బాధపడాలో తెలియడం లేదని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు స్టే- అప్పటివరకు నో FIR!