BJP Poster on Rahul Gandhi: 



రాహుల్‌పై సెటైర్..


5 రాష్ట్రాల ఎన్నికలతో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మరో ఆర్నెల్ల పాటు ఇదే హీట్‌ కొనసాగనుంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ఫీల్డ్ సిద్ధం చేసుకుంటోంది. అటు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 24 విపక్ష పార్టీలు I.N.D.I.A పేరుతో కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శల డోస్ రోజురోజుకీ పెరుగుతోంది. మాటల యుద్ధమే కాదు. సోషల్ మీడియాలోనూ పోస్టర్లతో సెటైర్లు వేసుకుంటున్నాయి రెండు పార్టీలు. కాంగ్రెస్‌ ట్విటర్ హ్యాండిల్‌ ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని పోస్టర్‌లు చేస్తుంటే...అటు బీజేపీ రాహుల్‌ని టార్గెట్‌గా చేసుకుని కౌంటర్‌లు ఇస్తోంది. ఈ క్రమంలోనే ట్విటర్‌లో ఓ పోస్టర్‌ పోస్ట్ చేసింది. అందులో రాహుల్ గాంధీని "Tubelight" గా చూపించింది. ఇది సల్మాన్ యాక్ట్ చేసిన మూవీ పోస్టర్‌. అందులో సల్మాన్ ఖాన్ తల తీసేసి రాహుల్ ఫొటోని అతికించింది బీజేపీ. Rahul Gandhi in & As Tubelight అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. Made in China అని ఆ పోస్టర్‌పై కోట్ చేసింది. కాంగ్రెస్ సమర్పణలో అని సెటైరికల్‌ క్యాప్షన్ కూడా ఇచ్చింది.





రాహుల్‌ని బీజేపీ ట్యూబ్‌లైట్ అని విమర్శించడం ఇదే తొలిసారి కాదు. 2020లో ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ సమయంలో రాహుల్‌ని ట్యూబ్‌లైట్‌తో పోల్చారు. లోక్‌సభలో తన ప్రసంగానికి రాహుల్ గాంధీ అడ్డుతగలడాన్ని ప్రస్తావిస్తూ అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. 


"నేను 30-40 నిముషాలుగా మాట్లాడుతున్నాను. నేను చెప్పిందేంటో వాళ్లకు అర్థం కావడానికి ఇంత సేపు పట్టింది. కొందరంతే ట్యూబ్‌లైట్‌లుగా ఉంటారు. మరో ఆర్నెల్లలో నన్ను ఈ దేశ యువత అంతా కలిసి కర్రలతో కొడతారని ఓ కాంగ్రెస్ నేత అన్నారు. ఇప్పటి నుంచి నేను సూర్య నమస్కారాలు కాసేపు ఎక్కువగా చేస్తాను. ఎన్ని కర్రలతో కొట్టినా తట్టుకునేంత దృఢంగా తయారవ్వాలి కదా"


- ప్రధాని నరేంద్ర మోదీ 


 కాంగ్రెస్ క్యాంపెయినింగ్ కూడా కాస్త దూకుడుగానే సాగుతోంది. సోషల్ మీడియాలోనూ బీజేపీని కవ్వించే పోస్ట్‌లు పెడుతోంది. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. "అబద్ధాల కోరు" అంటూ మోదీ ఫొటోను షేర్ చేసింది. త్వరలోనే ఎన్నికల ర్యాలీలకు సిద్ధం అంటూ వెల్లడించింది. ఆ తరవాత మరో ఫోటోనీ షేర్ చేసింది. అందులోనూ ప్రధాని మోదీని టార్గెట్ చేసింది. ఇవి బీజేపీయేతర వర్గాల్లోకి బాగానే వెళ్లాయి. 


 






దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఇదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీకి పది తలలు అతికించి రావణుడు అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ధర్మాన్ని నాశనం చేసే వ్యక్తి, భారత్‌ వ్యతిరేకి అంటూ స్ట్రాంగ్‌గా రిప్లే ఇచ్చింది. ఇలా రెండు పార్టీల మధ్య పోస్టర్ వార్ మొదలైంది.


 






Also Read: ఒక్క గంటలో 29 మందిని కరిచిన కుక్క, రాళ్లతో దారుణంగా కొట్టి చంపిన స్థానికులు


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply