Rajasthan Polling Updates:
9.7% పోలింగ్..
రాజస్థాన్‌లో పోలింగ్ (Rajasthan Voting) మొదలైంది. మొత్తం 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమాయనికి 40.27% పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలి జిల్లాలో ఓ పోలింగ్ ఏజెంట్ గుండెపోటు మృతి చెందడం కాసేపు కలకలం రేపింది. ఈ ఘటన మినహా మిగతా పోలింగ్ అంతా ప్రశాంగానే కొనసాగుతోంది. పోలింగ్‌కి ముందు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలు కీలక ట్వీట్‌లు చేశారు. గ్యారెంటీలు ఇచ్చే ప్రభుత్వానికే ఓటు వేయాలంటూ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోసారి పవర్‌ని ఒడిసి పట్టాలని చూస్తోంది. అటు బీజేపీ మాత్రం ఈ సారి తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాతో ఉంది.
"రాజస్థాన్ ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు లేవు. చాలా వరకూ పొదుపు చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నారు. మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. అందుకే ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌కే ఓటు వేస్తారు"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
నిజానికి ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కి లిట్మస్ టెస్ట్ లాంటివే. ఐదేళ్ల పాలనలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటూ వచ్చింది గహ్లోట్ ప్రభుత్వం. అంతర్గత కలహాలతో ఇబ్బందులు పడింది. సచిన్ పైలట్ తిరుగుబాటు తలనొప్పి తెచ్చి పెట్టింది. అయినా సరే మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చెబుతోంది. సంక్షేమ పథకాలపైనే పూర్తి భరోసాగా ఉంది. అటు బీజేపీ గట్టిగానే పోటీ ఇస్తోంది. కానీ ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. మొత్తం 1,862 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తం ఓటర్ల సంఖ్య 5 కోట్లపైనే. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ సహా సచిన్ పైలట్, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, రాజేందర్ రాథోర్ లాంటి కీలక వ్యక్తులు ఈ సారి బరిలో ఉండడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ మొత్తం 59 మంది ఎమ్మెల్యేలకు టికెట్‌లు ఇచ్చింది. అటు కాంగ్రెస్ 97 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్‌లు ఇచ్చి బరిలోకి దింపింది.
Also Read: రెస్క్యూ ఆపరేషన్‌కి అడ్డంకుల మీద అడ్డంకులు, మళ్లీ ఆగిన డ్రిల్లింగ్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి.*T&C Apply