A.P Directorate of Secondary Health Recruitment: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(APMSRB) సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల (CASS Posts) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నియంత్రణలోని ఆసుపత్రుల్లో రెగ్యులర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. అభ్యర్థులకు డిసెంబరు 11, 13, 14 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
వివరాలు..
* సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 150.
స్పెషాలిటీలవారీగా ఖాళీలు..
➥ గైనకాలజీ: 12
➥ అనస్థీషియా: 15
➥ పీడియాట్రిక్స్: 11
➥ జనరల్ మెడిసిన్: 37
➥ జనరల్ సర్జరీ: 03
➥ ఆర్థోపెడిక్స్: 01
➥ ఆప్తాల్మాలజీ: 10
➥ రేడియాలజీ: 38
➥ పాథాలజీ: 02
➥ ఈఎన్‌టీ: 07
➥ డెర్మటాలజీ: 11
➥ సైకియాట్రీ: 01
➥ ఫోరెన్సిక్ మెడిసిన్: 02
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, స్పెషల్ డాక్టర్లకు 70 సంవత్సరాలలోపు ఉండాలి.
ఎంపిక విధానం: పీజీ, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
పే స్కేల్: నెలకు రెగ్యులర్ పోస్టులకు రూ.61,960 నుంచి రూ.1,51,37. కాంట్రాక్ట్ పోస్టులకు- గిరిజన ప్రాంతమైతే రూ.2,50,000; గ్రామీణ ప్రాంతమైతే రూ.2,00,000; పట్టణ ప్రాంతమైతే రూ.1,30,000 వేతనం ఇస్తారు.
కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది. అవసరాన్ని బట్టి సర్వీసును పొడిగిస్తారు.
వాక్‌ఇన్ షెడ్యూలు..
➥ 11.12.2023 (సోమవారం)
సమయం: 10:00 AM to 01:00 PM
సబ్జెక్టులు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్
➥ 13.12.2023 (బుధవారం)
సమయం: 10:00 AM to 01:00 PM
సబ్జెక్టులు: గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్‌టీ, పాథాలజీ.
➥ 15.12.2023 (శుక్రవారం)
సమయం: 10:00 AM to 01:00 PM
సబ్జెక్టులు: పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, రేడియోలజీ, సైకియాట్రీ.
వాక్‌ఇన్ వేదిక:
O/o. Directorate of Secondary Health (formerly APVVP ),
H.No.77-2/G, Lakshmi Elite Building,
Prathur Road, Tadepalli-522501,
Guntur District, Andhra Pradesh.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు..
➥ పదోతరగతి లేదా తత్సమాన సర్టిఫికేట్ (పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం)
➥ పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/డీఎన్‌బీ అన్ని సంవత్సరాల సర్టిఫికేట్లు
➥ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
➥ రిటైర్డ్ అయిన స్పెషలిస్ట్ డాక్టర్లు, 01.07.2023 నాటికి 70 సంవత్సరాలు పూర్తికానివారు రిటైర్‌మెంట్ ఆర్డర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ తీసుకురావాలి.
➥ 4 నుంచి 10వ తరగతుల వరకు స్టడీ సర్టిఫికేట్లు.
➥ SC/ST/BC/EWS అభ్యర్థులైతే సోషల్ స్టడీస్ సర్టిఫికేట్ ఉండాలి.
➥ SADAREM డిజెబిలిటీ (ఆర్థోపెడికల్టీ డిజెబుల్డ్ సర్టిఫికేట్)
➥ ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్ (అవసరమైతే)
➥ స్పోర్ట్స్ సర్టిఫికేట్ (SAAP స్పోర్ట్స్ కోటా)
➥ కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ (DM &HO/DCHS/GGH సూపరింటెండెంట్/ప్రిన్సిపల్ జారీచేసిన).
➥ ఎన్‌వోసీ సర్టిఫికేట్
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply