Ban on Halal Products:



హలాల్ ఉత్పత్తులు..


కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. హలాల్‌ని కేంద్రం (Halal Ban) నిషేధిస్తుందన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్న క్రమంలోనే ఓ క్లారిటీ ఇచ్చారు. హలాల్‌ని నిషేధం విధించే విషయంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. హలాల్ సర్టిఫైడ్‌ ప్రొడక్ట్స్‌ని  (Halal Certified Products)విక్రయించకుండా బ్యాన్ చేయాలన్న డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. కానీ అమిత్‌షా మాత్రం ప్రస్తుతానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే యూపీలో హలాల్‌ ఉత్పత్తులపై నిషేధం విధించారు. నవంబర్ 19న ఈ నిర్ణయం (Halal Ban in UP) తీసుకుంది. హలాల్ ట్యాగ్‌ ఉన్న ప్రొడక్ట్స్‌ని మార్కెట్‌లో విక్రయించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. తక్షణమే ఈ నిబంధనల అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అయితే...ఎగుమతుల కోసం తయారు చేసిన హలాల్‌ ఉత్పత్తులకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. హలాల్‌ ట్యాగ్ ఉన్న మెడిసిన్స్, మెడికల్ డివైస్‌లు, కాస్మెటిక్స్ ఏవైనా రాష్ట్రవ్యాప్తంగా విక్రయించడానికి వీలుండదని అధికారులు స్పష్టం చేశారు. 


హలాల్‌తో కన్‌ఫ్యూజన్..!


నిజానికి హలాల్ సర్టిఫికేషన్ అనేది మార్కెట్‌లో ఓ కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఈ ఉత్పత్తులేవీ Food Safety and Standards Act లోని సెక్షన్ 89 కిందకు రావడం లేదు. అలాంటప్పుడు ఆ ఉత్పత్తులు నాణ్యమైనవే అని ఎలా చెప్పలగం అన్నది మరో వాదన. అందుకే ఆహార పదార్థాల నాణ్యతను తేల్చాల్సింది ప్రభుత్వ సంస్థలే తప్ప మిగతా ఏ సంస్థలూ దాన్ని నిర్ణయించలేవని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతోంది. ఈ నిర్ణయం తీసుకోడానికి ఓ కారణముంది. కొందరు కావాలనే హలాల్ ట్యాగ్ తగిలించి తమ ఉత్పత్తులకు డిమాండ్ పెంచుకుంటున్నారు. ఇది చాలా పెద్ద దందాగా మారింది. Halal India Private Limited Chennai సహా మరి కొన్ని సంస్థలపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం ఓ వర్గానికి చెందిన కస్టమర్స్‌కి మాత్రమే హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చి మతాన్ని అడ్డుగా చూపించి సేల్స్ పెంచుకుంటున్నారు. 


హలాల్ అంటే..


హలాల్ అనే పదం.. అరబ్బీ నుంచి వచ్చింది. హలాల్ అంటే ధర్మబద్ధమైనది లేదా అనుమతించదగినదని అర్థం. ప్రపంచంలోని దాదాపు ముస్లింలు అంతా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ హలాల్ ఆహార పదార్థాల వాణిజ్య మార్కెట్టు ప్రపంచవ్యాప్తంగా 580 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉందని అంచనా. హలాల్‌కు వ్యతిరేక పదం హరామ్. దీనికి నిషేధించినది, అధర్మమైనది, అనైతికమైనది అని అర్థం ఉంది. ఆహార పదార్థాలకు "హలాల్ సర్టిఫికేట్" ఇచ్చే సంప్రదాయం ముస్లింలలో ఉంది. జంతువుల మాంసాలను, హలాల్ చేసిన తరువాత మాత్రమే తినాలని వారు నమ్ముతారు.హలాల్ కోసం మొదట జంతువును నేలపై పడుకోబెడతారు. "బిస్మిల్లాహి అల్లాహు అక్బర్" అని చెబుతూ జబీహా చేస్తారు. తల నుంచి శరీరం వేరుకాకుండా జాగ్రత్త పడుతూ మెడ దగ్గర కోస్తారు. అలా రక్తాన్ని బయటకు తీసేస్తారు. ఈ మొత్తం విధానాన్ని హలాల్ అని పిలుస్తారు. ముస్లిం మతం విశ్వాసాల ప్రకారం.. హలాల్ మాంసం తప్ప మరే ఇతర పద్ధతిలో వధించిన జంతువు మాంసాన్ని వాళ్లు తినరు.


Also Read: Rajasthan Voting Updates: రాజస్థాన్‌ ఓటింగ్‌లో అలజడి, గుండెపోటుతో ఓ పోలింగ్ ఏజెంట్ మృతి