Dogs Attack in Chennai:



చెన్నైలో ఘటన..


చెన్నైలో రాయపురంలో ఓ కుక్క గంటలోనే 29 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అందరిపైనా దాడి చేసింది. బాధితులందరికీ రేబిస్ సోకడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు ఆ కుక్కని రాళ్లతో కొట్టి చంపారు. ఈ కుక్క కాటు బాధితుల్లో 10 మంది చిన్నారులే ఉన్నారు. మరి కొందరు వృద్ధులున్నారు. దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కింద పడి చాలా మందికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. 29 మందిలో 24 మందికి లోతైన గాయాలైనట్టు వైద్యులు వెల్లడించారు. రాత్రికి రాత్రే ఈ బాధితులంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వరుస కట్టారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది వాళ్లకు వెంటనే యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లు అందించింది. మరో నాలుగు సార్లు ఈ వ్యాక్సిన్ డోస్‌లు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. అయితే ఈ రాయపురం ఏరియాలోనే కుక్కల బెడద ఎక్కువగా ఉంది. చాలా సార్లు స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ 52 కుక్కల్ని పట్టుకున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ నిఘా పెడుతున్నారు. కానీ...ఉన్నట్టుండి ఈ కుక్క ఒక్క రోజే 29 మందిపై దాడి చేయడం ఆందోళన కలిగించింది. 


"కుక్కల బెడదపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. వీటి సంఖ్య తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. నవంబర్ 27 నుంచి పూర్తి స్థాయిలో నిఘా పెట్టాం. అన్ని కుక్కలకూ వ్యాక్సిన్‌లు ఇస్తున్నాం. ఏటా 15-17 వేల కుక్కలకు స్టెరిలైజేషన్స్ చేస్తున్నాం. రాయపురంలో 29 మందిపై కుక్క దాడి చేసింది. వాళ్లందరికీ రేబిస్‌ పాజిటివ్‌గా తేలింది. యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లు అందించాం"


- గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు


ప్రభుత్వం అప్రమత్తం..


తమిళనాడులో చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. ఆరోగ్యమంత్రి సుబ్రహ్మణియన్ కూడా ఈ సమస్యపై స్పందించారు. ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుక్కల ద్వారా సోకే రేబిస్ వ్యాధి ఒక్కోసారి ప్రాణాలనీ తీస్తుంది. అందుకే ప్రభుత్వం అప్రమత్తమైంది. 


Also Read: Uttarakashi Tunnel Rescue Operation: రెస్క్యూ ఆపరేషన్‌కి అడ్డంకుల మీద అడ్డంకులు, మళ్లీ ఆగిన డ్రిల్లింగ్


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply