'Agnipath' Bjp Leaders : ఆర్మీలో నియామకాల కోసం తీసుకు వస్తున్న అగ్నిపథ్ పథకం చుట్టూ ఇప్పుడు వివాదం ముసురుకుంది. మంచిది కాదని ఇతర పార్టీలు అంటున్నాయి. కానీ మంచిదే అని బీజేపీ నేతలు అంటున్నారు పలువురు బీజేపీ నేతలు అగ్నిపథ్ పై జరుగుతున్న ప్రచారం... నిజం ఏమిటో సోషల్ మీడియాలో వివరిస్తున్నారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అగ్నిపథ్‌పై ప్రచారంలో ఉన్న కొన్ని విషయాలను.. అందులో వాస్తవాలను ట్వట్ల ద్వారా వివరించారు. సైన్యం బలహీమనవుతుందని.. రెజిమెంట్ వ్యవస్థ దెబ్బతింటుందని వస్తున్న విమర్శలను విష్ణువర్ధన్ రెడ్డి తోసి పుచ్చారు.
అగ్నిపథ్‌పై వెనక్కి తగ్గని కేంద్రం- 2 రోజుల్లో నోటిఫికేషన్, డిసెంబర్‌లోనే తొలి బ్యాచ్!
ప్రపంచంలో చేలా దేశాల సైన్యాలు యువత మీదనే ఆధారపడుతున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.
అగ్నిపథ్‌తో సైన్యానికి లాభమా, నష్టమా- ప్రభుత్వం ఏం చెబుతోంది
సైన్యంలో యువతకు అవకాశాలు తగ్గుతాయన్న వాదనను కూడా బీజేపీ నేతలు ఖండిస్తున్నారు.
సికింద్రాబాద్‌లో విధ్వంసం ఎఫెక్ట్ - ఏపీలో హైఅలెర్ట్, రైల్వే స్టేషన్లలో భద్రత పెంపు
బీజేపీ జనరల్ సెక్రటరీ సత్యకుమార్ కూడా ఓ వివరణాత్మక ప్రకటన ట్వీట్ చేశారు.
ఇటు బీజేపీ నేతలు వారి వాదన వారు వినిపిస్తున్నారు. అగ్నిపథ్ వల్ల ఎలాంటి నష్టం ఉండదంటున్నారు. కానీ ఆశావహులు మాత్రం తాము నమ్మిందే నిజమని ఆందోళనలు కొనసాగిస్తున్నారు.