Agniveers Training: అగ్నిపథ్‌పై వెనక్కి తగ్గని కేంద్రం- 2 రోజుల్లో నోటిఫికేషన్, డిసెంబర్‌లోనే తొలి బ్యాచ్!

ABP Desam Updated at: 17 Jun 2022 03:36 PM (IST)
Edited By: Murali Krishna

Agniveers Training: అగ్నిపథ్ పథకం అమలులో కేంద్రం వెనక్కి తగ్గేలే కనిపించడం లేదు. రెండు రోజుల్లోనే అగ్నిపథ్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్ ప్రకటించారు.

అగ్నిపథ్‌పై వెనక్కి తగ్గని కేంద్రం- 2 రోజుల్లో నోటిఫికేషన్, డిసెంబర్‌లోనే తొలి బ్యాచ్!

NEXT PREV

Agniveers Training: 'అగ్నిపథ్' పథకంపై వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతోన్న వేళ ఆర్మీ, వాయుసేన అధిపతులు కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద త్వరలోనే నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అగ్నిపథ్ పథకంలో భాగంగా ఈ ఏడాది చేరే అభ్యర్థులకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.







కరోనా కారణంగా గత రెండేళ్లలో సైన్యంలో చేరే అవకాశం రానివారికి ఈ నిర్ణయం ఉపశమనం కలిగించినట్లు అయింది. 2022 డిసెంబర్‌లో మొదటి బ్యాచ్​ అగ్నివీరులకు శిక్షణ​ ప్రారంభిస్తాం. 2023 జూన్​ లేదా జులైలో వీరికి బాధ్యతలు అప్పగిస్తాం. ఈ నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్​ విడుదల చేస్తాం. త్వరలోనే రిజిస్ట్రేషన్​ మొదలైన అంశాలపై షెడ్యూల్​ ప్రకటిస్తాం.                                                - మనోజ్​ పాండే, ఆర్మీ చీఫ్​  


ఈ నెల్లోనే






మరోవైపు ఈ నెలలోనే వాయుసేన నియామకాలు ప్రారంభిస్తున్నట్లు వాయుసేన అధిపతి వీఆర్ చౌదరి ప్రకటించారు. ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.



ఈ ఏడాది జరిగే అగ్నిపథ్​ నియాకాల్లో అభ్యర్థులకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇది యువతకు మేలు చేస్తుంది. వాయుసేనలో అగ్నిపథ్​ నియమకాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి.                                        - వీఆర్​ చౌదరి, ఎయిర్​ఫోర్స్​ చీఫ్


Also Read: Agnipath Protests In Hyderabad: అగ్గి రాజేసిన ఆందోళనలు- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ధ్వంసం, పలు రైళ్లకు నిప్పు


Also Read: Agneepath Recruitment Scheme: అగ్నిపథ్‌తో సైన్యానికి లాభమా, నష్టమా- ప్రభుత్వం ఏం చెబుతోంది

Published at: 17 Jun 2022 03:22 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.