Agnipath Protest In India: సికింద్రాబాద్ ఘటనపై అమిత్ షా సమీక్ష- దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లకు భద్రత పెంపు
Agnipath Protest In India: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన హింసాత్మక ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు.

Agnipath Protest In India: సికింద్రాబాద్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లలో అగ్నిపథ్ ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లకు భద్రతను పెంచింది. రైల్వే స్టేషన్ల దగ్గర భారీగా పోలీసులను మోహరించింది.
అమిత్ షా సమీక్ష
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న యువత శాంతించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చెందవద్దని, అగ్నిపథ్ వల్ల యువతకు ప్రయోజనం ఉందన్నారు.
సికింద్రాబాద్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనపై అమిత్ షా సమీక్షించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ఘటన వివరాలను తెలుసుకున్నారు.
అర్థం చేసుకోవాలి
అగ్నిపథ్ ఆందోళనపై మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా స్పందించారు. అగ్నిపథ్‌ను యువత సరిగా అర్థం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పోతుందని అనుకోవద్దన్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని.. అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.
రైల్వే జీఎం భేటీ
మరో వైపు సికింద్రాబాద్ ఘటనపై ఉన్నతాధికారులతో రైల్వే జీఎం అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఆస్తి నష్టం, ప్రయాణికుల ప్రత్యామ్నాయం తరలింపుపై అధికారులతో చర్చించారు.
సికింద్రాబాద్‌లో ఆందోళనకారులు అజంతా, ఈస్ట్‌కోస్ట్, ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను ధ్వంసం చేసి నిప్పుపెట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 40 ద్విచక్రవాహనాలు కూడా ధ్వంసం అయ్యాయన్నారు.
Also Read: Agnipath Protests: అగ్నిపథ్ సెగలు- బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు