Agneepath Recruitment Scheme: సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించేందుకు యవతకు రక్షణ శాఖ ఇచ్చిన అవకాశం అగ్నిపథ్ పథకం. నాలుగేళ్ళపాటు దేశానికి సేవలందించడానికి అగ్నివీరులను నియమించే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించడం తెలిసిందే. తాజాగా యువతకు మరో శుభవార్త చెప్పింది కేంద్రం. 'అగ్నిపథ్' పథకంలో భాగంగా ఆర్మీలో చేరి సేవలు అందించనున్న అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఇందులో చేరేందుకు గరిష్ట వయో పరిమితి 23కి చేరింది. పదిహేడున్నరేళ్ల నుంచి 23 సంవత్సరాల వయసుగల వారిని త్రివిధ దళాల్లో అగ్నివీరులుగా నియమిస్తారు. అగ్నిపథ్ పథకాన్ని గతంలో 'టూర్ ఆఫ్ డ్యూటీ'గా పిలిచేవారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించారు.
నాలుగేళ్ల సర్వీస్
ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళ సైనిక సేవలు రిక్రూట్‌మెంట్ వ్యవస్థలో కేంద్ర రక్షణశాఖ విప్లవాత్మక మార్పులు తీసుకోస్తుంది. కొత్తగా ప్రతిపాదించిన మార్పుల ప్రకారం రిక్రూట్ చేసిన సైనికులందరూ 4 సంవత్సరాల తర్వాత సర్వీస్ నుండి విడుదల అవుతారు. అంతే కాదు సర్వీస్ నుంచి రిలీజ్ అయిన వారిలో కొంత మందిని పూర్తి సేవల కోసం తిరిగి చేర్చుకోవడం తప్పనిసరి. ఈ మార్పులను టూర్ ఆఫ్ డ్యూటీ/అగ్నీపథ్ పథకం (Agneepath Recruitment Scheme)లో భాగంగా చేపట్టబోతున్నారు.
అగ్నిపథ్ స్కీమ్ అర్హతలు ఇవే..
యువతకు సైన్యం అన్ని రకాల విభాగాల్లో సేవలు అందించేందుకు అవకాశం కల్పిస్తోంది అగ్నిపథ్ స్కీమ్. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఇటీవలే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల ప్రకటించారు. ఈ అగ్నిపథ్ సర్వీస్‌లో చేరేందుకు 17.5 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వయసు వారు అర్హులు. ఎంపికైన వారికి ఆర్నెల్ల పాటు శిక్షణ అందించి మూడున్నరేళ్ల పాటు సర్వీసులో ఉంచుతారు. ఇదో చరిత్రాత్మక నిర్ణయమని, మొదటి విడతలో 46 వేల మందిని సైనికులుగా తీర్చి దిద్దుతామంటూ కేంద్ర రక్షణశాఖ వెల్లడించింది.
ఎంపిక అనంతరం ఇలా..
అగ్నిపథ్ స్కీమ్‌లో ఎంపికైన యువతకు ఆర్నెళ్ల పాటు శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తైన అనంతరం మూడున్నరేళ్ల పాటు సర్వీసులో ఉంచుతారు. ఈ నాలుగేళ్లు పూర్తయ్యాక ప్రతిభ ఆధారంగా 25% మందిని శాశ్వత కమిషన్‌లో పని చేసేందుకు అవకాశం కల్పిస్తారు. తొలి సంవత్సరం వీరికి రూ.4.76 లక్షల ప్యాకేజీ అందిస్తారు. రెగ్యులర్ సైనికులకు అందించే పెన్షన్లు, జీతాలు కోసం చేసే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. కానీ ఈ రిక్రూట్‌మెంట్ విధానంపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. ఈ విధానం సరికాదంటూ యువత చేపట్టిన నిరసలు విధ్వంసానికి దారితీస్తున్నాయి. నాలుగు సంవత్సరాల సర్వీస్‌తో దాదాపు 80 శాతం మంది సైనికులు విధుల నుంచి ఉపశమనం పొందుతారు. తదుపరి ఉపాధి మార్గాల కోసం సాయుధ దళాల నుంచి సహాయం పొందుతారు.
Also Read: Agneepath Recruitment Scheme: యువతకు రక్షణ శాఖ బంపర్ ఆఫర్- దేశానికి సేవచేయాలంటే రండి!
Also Read: Agneepath Recruitment Scheme: అగ్నిపథ్‌తో సైన్యానికి లాభమా, నష్టమా- ప్రభుత్వం ఏం చెబుతోంది