Agneepath Recruitment Scheme: దేశ యువతకు రక్షణ శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నాలుగేళ్ళపాటు దేశానికి సేవలందించడానికి అగ్నివీరులను నియమించే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. 'అగ్నిపథ్' పేరుతో ప్రారంభమైన ఈ పథకంలో పదిహేడున్నరేళ్ళ నుంచి 21 సంవత్సరాల వయసుగలవారిని త్రివిధ దళాల్లో అగ్నివీరులుగా నియమిస్తారు.
అగ్నిపథ్ పథకాన్ని గతంలో 'టూర్ ఆఫ్ డ్యూటీ'గా పిలిచేవారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. భద్రతకు సంబంధించిన కేబినెట్ కమిటీ రెండేళ్ళపాటు విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ పథకానికి ఆమోదం తెలిపింది.
నాలుగేళ్లు
అగ్నిపథ్ స్కీమ్ కింద యువకులు నాలుగు సంవత్సరాల పాటు సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తారు. ఈ పథకం రక్షణ దళాల ఖర్చులు , వయస్సు ప్రొఫైల్ తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఒక భాగం. రిక్రూట్‌మెంట్ విధానంలో ఇదొక సమూల మార్పుగా పరిగణించవచ్చు.
నాలుగు సంవత్సరాల సర్వీస్‌తో దాదాపు 80 శాతం మంది సైనికులు విధుల నుంచి ఉపశమనం పొందుతారు. తదుపరి ఉపాధి మార్గాల కోసం సాయుధ దళాల నుంచి సహాయం పొందుతారు. అనేక సంస్థలు దేశానికి సేవ చేసిన, శిక్షణ పొందిన క్రమశిక్షణ కలిగిన యువతకు ఉద్యోగాలను రిజర్వ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
టూర్ ఆఫ్ డ్యూటీ కాన్సెప్ట్ కింద గణనీయమైన సంఖ్యలో సైనికులను రిక్రూట్ చేసుకుంటే వేతనం, అలెవెన్సులు పెన్షన్‌లలో వేల కోట్లు ఆదా అవుతుందని సాయుధ దళాల ప్రాథమిక లెక్కలు అంచనా వేసింది. రిక్రూట్ చేసుకున్న యువతలో అత్యుత్తమమైన వారిని తిరిగి ఖాళీలు అందుబాటులో ఉన్నట్లయితే, వారి సేవను కొనసాగించే అవకాశం ఉంది. ప్రపంచంలో ఎనిమిది దేశాలలో ఇలాంటి నియామక నమూనాలను అధ్యయనం చేసింది రక్షణ శాఖ.
Also Read: 777 Charlie Movie: '777 చార్లీ' సినిమా చూసి బోరుమన్న సీఎం- ఈ చిత్రం తప్పక చూడాలట!
Also Read: Karnataka News: 'కొండంత శోకం, నేనున్న లోకం'- కన్నీరు తెప్పిస్తోన్న బాలుడి సూసైడ్ లెటర్