777 Charlie Movie: '777 చార్లీ' సినిమా చూసి బోరుమన్న సీఎం- ఈ చిత్రం తప్పక చూడాలట!

ABP Desam   |  Murali Krishna   |  14 Jun 2022 04:10 PM (IST)

777 Charlie Movie: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కన్నీళ్లు పెట్టుకున్నారు. '777' చార్లీ సినిమా చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

'777 చార్లీ' సినిమా చూసి బోరుమన్న సీఎం- ఈ చిత్రం తప్పక చూడాలట!

777 Charlie Movie: 777 చార్లీ (777 Charlie) సినిమా చూసి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై బోరున ఏడ్చేశారు. ఆయన కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పెంపుడు కుక్కతో ఓ వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించారని సీఎం ప్రశంసించారు.

కుక్కల గురించి చాలా సినిమాలు వచ్చాయి. అయితే జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించారు. కుక్క తన కళ్లతో ఎమోషన్స్‌ని బాగా పలికించింది. సినిమా చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. షరతులు లేని ప్రేమ గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను. కుక్కలది షరతులు లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ.                                                             -    బసవరాజ్ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి

ఇదే కారణం

ముఖ్యమంత్రి బొమ్మై ఈ సినిమా చూసి అంత భావోద్వేగానికి గురికావడానికి ఓ కారణం ఉంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట. సినిమా చూస్తూ చాలా భావోద్వేగానికి గురయ్యారట. సినిమా హాలులోనే కన్నీళ్లు పెట్టుకున్నారట. 

Also Read: Karnataka News: 'కొండంత శోకం, నేనున్న లోకం'- కన్నీరు తెప్పిస్తోన్న బాలుడి సూసైడ్ లెటర్

Also Read: Supreme Court: 'సహజీవనం'పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు- వారసత్వ ఆస్తిలో ఆ పిల్లలకూ హక్కు!

Published at: 14 Jun 2022 04:00 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.