ABP  WhatsApp

Supreme Court: 'సహజీవనం'పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు- వారసత్వ ఆస్తిలో ఆ పిల్లలకూ హక్కు!

ABP Desam Updated at: 14 Jun 2022 01:02 PM (IST)
Edited By: Murali Krishna

Supreme Court: సహజీవనం చేసిన జంటకు పుట్టిన బిడ్డ అక్రమం సంతానం కాదని సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

'సహజీవనం'పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు- వారసత్వ ఆస్తిలో ఆ పిల్లలకూ హక్కు!

NEXT PREV

Supreme Court: 'సహజీవనం'పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం చేసిన జంటకు పుట్టిన బిడ్డ అక్రమ సంతానం కాదని సుప్రీం తేల్చిచెప్పింది. ఆ బిడ్డలు వారి పూర్వీకుల ఆస్తికి కూడా హక్కుదారులు అంటూ సంచలన తీర్పునిచ్చింది. ఈ అంశంపై గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.







సహజీవనం దీర్ఘకాలంగా కొనసాగితే దానిని అక్రమ సంబంధంగా భావించకూడదు. దానిని వివాహ బంధంగానే పరిగణించాలి. వారికి పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా కూడా ఇవ్వాల్సిందే.                                                                     -     సుప్రీం కోర్టు


ఇదే కేసు


కేరళకు చెందిన దామోదరన్, చిరుతకుట్టి జంట సుదీర్ఘకాలంగా సహజీవనం చేస్తోంది. వీరికి ఓ మగపిల్లాడు పుట్టాడు. పిల్లాడు పుట్టినా వీరు వివాహం చేసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో వారికి పుట్టిన బాబును అక్రమ సంతానం అని అందుకే పూర్వీకుల ఆస్తి ఇచ్చేది లేదని సదరు కుటుంబానికి చెందిన బంధువులు చెప్పారు. దీంతో ఈ జంట కేరళ హైకోర్టును ఆశ్రయించింది.


కోర్టులో కూడా వారికి నిరాశే ఎదురైంది. సదరు జంటకు పుట్టిన సంతానం అక్రమ సంతానమని పేర్కొంటూ వారి పూర్వీకుల ఆస్తిలో అతడికి వాటా దక్కదని కేరళ హైకోర్టు 2009లో తీర్పు ఇచ్చింది.


దీంతో బాధిత జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా వీరి పిటిషన్‌ను జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది. ఈ విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు తీర్పును సుప్రీం వ్యతిరేకించింది. ఓ జంట దీర్ఘకాలంగా సహజీవనం చేస్తుంటే వారు వివాహం చేసుకున్నట్టుగానే పరిగణించాలని పేర్కొంది.


Also Read: Viral News: 'మాకు భార్యలు వద్దు బాబోయ్'- భార్యా బాధితుల సంఘం వింత పూజలు


Also Read: Coronavirus Cases Today: దేశంలో కొత్తగా 6 వేల కరోనా కేసులు- ఆరుగురు మృతి

Published at: 14 Jun 2022 12:54 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.