Coronavirus Cases Today: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 6594 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. తాజాగా 4,035 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు 98.67 శాతానికి చేరింది. మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.12 శాతంగా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.32 శాతం వద్ద ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,32,36,695
- మొత్తం మరణాలు: 5,24,777
- యాక్టివ్ కేసులు: 50,548
- మొత్తం రికవరీలు: 4,26,57,335
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 14,65,182 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 195,35,70,360 కోట్లకు చేరింది. మరో 3,21,873 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పగా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్రం సూచించింది.
Also Read: PM Modi on Jobs: నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త - త్వరలోనే 10 లక్షల ఉద్యోగాలకు ప్రధాని మోదీ నిర్ణయం
Also Read: Ukraine : ఉక్రెయిన్‌కు కొత్త కష్టం - పొంచి ఉన్న వ్యాధుల గండం !