Viral News: "ఈ భార్యలు మాకొద్దు మహాప్రభో" అంటూ భార్యా బాధిత సంఘానికి చెందిన కొంతమంది వింత పూజలు చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఈ వింత పూజల వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే?
ఇదీ జరిగింది
ఒకప్పుడు వివాహమైన తర్వాత భర్త వేధిస్తున్నాడని భార్యలు గొడవ చేసేవారు. లేదా పోలీస్ స్టేషన్లు గృహ హింస కేసు పెట్టేవారు. అయితే ఈ మధ్య భార్యలు వేధిస్తున్నారని భర్తలు తిరిగి కేసులు పెడుతున్నారు. అంతేకాకుండా "వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా" అంటూ సాంగ్‌లు పాడుతున్నారు.
మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో అయితే భార్యలు మాకొద్దంటే వద్దు.. అంటూ ఏకంగా పూజలు కూడా చేశారు. తమకు భార్యలు వద్దంటూ భార్యా బాధితుల సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా ఓ ఆలయానికి వెళ్లి మాకు ఈ భార్యలు వద్దు మహాప్రభో అంటూ పూజలు నిర్వహించారు.
సాధారణంగా వట సావిత్రి పౌర్ణమి రోజున మహిళలు 7 జన్మలకు ఒక్కరే భర్తగా రావాలని పూజలు చేస్తుంటారు. అయితే 7 జన్మలు కాదు 7 సెకన్లు కూడా ఈ పెళ్ళాలు మాకొద్దు అంటూ భార్య బాధితుల సంఘం సభ్యులు పూజలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మధ్య
రాజస్థాన్ అల్వార్ జిల్లా భివాడి పట్టణంలో ఈ మధ్య ఇదే తరహా ఘటన జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తోన్న అజిత్ యాదవ్ తన భార్య చిత్రహింసలకు గురిచేస్తుందని ఆయన వాపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అజిత్ యాదవ్ అల్వార్ కోర్టులో గృహహింస చట్టం కింద కేసు కూడా పెట్టాడు. ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉందని, ఎలాంటి కారణం లేకుండా భార్య చితకబాదుతోందని అజిత్ కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కోర్టు, పోలీసులే తనను కాపాడాలని అభ్యర్థించాడు. భార్య తనపై దాడి చేసిన సీసీటీవీ ఫుటేజీని కోర్టుకు సమర్పించాడు.
ఈ ఫుటేజిని పరిశీలించిన న్యాయస్థానం బాధిత భర్త చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పోలీసులను ఆదేశించింది. అవసరమైతే భద్రత కూడా కల్పించాలని సూచించింది.
Also Read: Coronavirus Cases Today: దేశంలో కొత్తగా 6 వేల కరోనా కేసులు- ఆరుగురు మృతి
Also Read: PM Modi on Jobs: నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త - త్వరలోనే 10 లక్షల ఉద్యోగాలకు ప్రధాని మోదీ నిర్ణయం