Gold Price Today 17th June 2022: బంగారం కొనుగోలుదారులకు మళ్లీ షాక్ తగిలింది. గత రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు నేడు పుంజుకున్నాయి. మరోవైపు వెండి ధర నిలకడగా ఉంది. రూ.430 మేర పెరగడంతో  తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870కి పుంజుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,550 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.66,000 అయింది.


నేడు ఏపీలో బంగారం ధర.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 17th June 2022)  10 గ్రాముల ధర రూ.51,870 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,550 అయింది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.66,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి


విశాఖపట్నం, తిరుపతిలో రూ.660 మేర ఎగబాకడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,550 అయింది.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో నేడు 1 కేజీ వెండి ధర రూ.66,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 


ప్రధాన నగరాల్లో బంగారం ధర..
ఢిల్లీలో రూ.460 పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,900 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,580 కి చేరింది. 
చెన్నైలో బంగారంపై రూ.480 పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 తో దేశంలోనే రికార్డ్ ధరలో విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,870గా ఉంది.


పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.