ABP  WhatsApp

Prophet Remark Row: నుపుర్ శర్మ వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా రియాక్షన్ ఇదే

ABP Desam Updated at: 17 Jun 2022 02:45 PM (IST)
Edited By: Murali Krishna

Prophet Remark Row: నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను అమెరికా ఖండించింది.

నుపుర్ శర్మ వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా రియాక్షన్ ఇదే

NEXT PREV

Prophet Remark Row: మహ్మద్ ప్రవక్తపై ఇటీవల భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను అగ్రరాజ్యం ఖండించింది.






ఇద్దరు భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయం. వారి వ్యాఖ్యలను అమెరికా ఖండిస్తుంది. అయితే వారి వ్యాఖ్యలను భాజపా బహిరంగంగా వ్యతిరేకించడం పట్ల సంతోషంగా ఉన్నాం. మత స్వేచ్ఛ లేదా విశ్వాసాలకు సంబంధించిన మానవ హక్కుల ఆందోళనలపై ఎప్పటికప్పుడు భారత్‌తో సీనియర్ అధికారుల స్థాయి సంప్రదింపులు జరుపుతున్నాం.                                                                          -     నెడ్ ప్రైస్, యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి  


వ్యాఖ్యల దుమారం


మహ్మద్ ప్రవక్తపై ఇటీవల ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలను అనేక ఇస్లామిక్ దేశాలు ఖండించాయి. దీంతో భాజపా.. నుపుర్ శర్మను సస్పెండ్ చేసింది. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ముంబయి పోలీసులు మే 28న నుపుర్ శర్మపై పలు సెక్షన్​ల కింద కేసు నమోదు చేశారు.


ముంబయిలోని పిదోనీ పోలీసులు కూడా నుపుర్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు తనకు ప్రాణహాని ఉందని నుపుర్ శర్మ.. దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దిల్లీ పోలీసులు నుపుర్ శర్మ, ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించారు.


Also Read: Agnipath Protests In Hyderabad: అగ్గి రాజేసిన ఆందోళనలు- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ధ్వంసం, పలు రైళ్లకు నిప్పు


Also Read: Agneepath Recruitment Scheme: అగ్నిపథ్‌తో సైన్యానికి లాభమా, నష్టమా- ప్రభుత్వం ఏం చెబుతోంది

Published at: 17 Jun 2022 01:33 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.