Baramulla Encounter: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు కలకలం రేపారు. పలు చోట్ల ఉగ్రదాడులకు ప్లాన్ చేశారని గుర్తించిన నిఘా వర్గాలు ఆర్మీని అలర్ట్ చేశాయి. రంగంలోకి జమ్మూ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్, ఇతర ప్రత్యేక బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన సమయంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. బరాముల్లా జిల్లాలోని మాల్వా ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సహా నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు శుక్రవారం ఉదయం వెల్లడించారు.
బద్గామ్ స్పెషల్ పోలీస్ టీమ్ పక్కా సమాచారంతో ఆర్మీతో కలిసి సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించగా.. ఉగ్రవాదుల స్థావరాన్ని కనిపెట్టారు. అక్కడికి ఆర్మీ, పోలీస్ టీమ్ చేరుకోగానే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డాయి. అలర్ట్ అయిన బలగాలు ఎదురుకాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. బారాముల్లా పోలీసులు ఎస్‌ఎస్‌పీ బారాముల్లా ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాల్పులు జరగగా ఓ పోలీస్ గాయపడ్డారని, ఆయనను శ్రీనగర్ లోని ఆర్మీ బేస్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మోస్ట్ వాంటెడ్‌గా మారిన యూసఫ్..
జమ్మూ కాశ్మీర్ పోలీసుల వివరాల ప్రకారం.. యూసఫ్ కంట్రూ అనే ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్ (Hizbul Mujahideen)లో సభ్యుడిగా ఉండగా.. 2005లో సెర్చ్ ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. 2008లో విడుదలైన యూసఫ్.. 2017లో పౌరులు, పోలీసులు, రాజకీయ నేతలపై కాల్పులు జరిపి మారణహోమానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో హిజ్బుల్ గ్రూప్ నుంచి యూసఫ్ మరో ఉగ్ర సంస్థ లష్కర్ ఏ తొయిబా (Lashkar-e-Toiba)లో చేరాడు. కొంతకాలానికే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా మారిన యూసఫ్ కోసం ఇదివరకే పలు సెర్చ్ ఆపరేషన్‌లు నిర్వహించగా చాకచక్యంగా తప్పించుకుంటూ వస్తున్నాడు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ యూసఫ్ కంట్రూర్ సహా నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూకాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
కొనసాగుతున్న ఆపరేషన్..
ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాలు, మారణాయుధాలను ఆర్మీ, స్పెషల్ టీమ్ స్వాధనం చేసుకున్నాయి. బారాముల్లాలోని మాల్వా ప్రాంతంతో పాటు అనుమానిత ఏరియాలలోనూ ఉగ్రవాదుల జాడ కోసం శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ ఆర్మీ, పోలీసు సిబ్బందిలోనూ కొందరు గాయపడ్డారు.
Also Read: Nara Lokesh: గుడివాడ గడ్డం గ్యాంగ్ లీడర్ విశ్వరూపం ఇదే - RIపై జేసీబీ దాడి ఘటనపై లోకేశ్