Anant Radhika Wedding Live: అంబరాన్ని అంటుతున్న అనంత్-రాధిక వివాహం సంబరం - తరలివచ్చిన తారాలోకం, ప్రత్యేక దుస్తుల్లో సందడి

Anant Ambani Radhika Merchant Wedding: అనంత్-రాధిక పెళ్లి వ్యాపార, సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ప్రముకులు వివాహానికి వెళ్లారు. 

Sheershika Last Updated: 12 Jul 2024 07:30 PM
అనంత్ - రాధికా వివాహ వేడుక - బంగారు వర్ణ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ధోనీ

Anant Ambani Wedding: ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వైభవంగా సాగుతోంది. ఆయన కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ వేడుకకు  దేశవిదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. ముంబైలోని 'జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌'లో వివాహం జరగనుంది. పెళ్లి వేదిక వద్దకు అంబానీ కుటుంబం వరుడు అనంత్‌తో కలిసి వచ్చారు. ప్రముఖ నటుడు రితేశ్ దేశ్ ముఖ్, జెనీలియా దంపతులు, ప్రముఖ నటుడు సంజయ్ దత్ వేడుకకు హాజరయ్యారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబ సమేతంగా పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఆయన బంగారు వర్ణం సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఆయన సతీమణి సాక్షి, కుమార్తె సైతం ప్రత్యేక దుస్తుల్లో మెరిశారు. ప్రముఖ నటి జాన్వీకపూర్, శిఖర్ పహారియాతో వివాహ వేడుకకు హాజరయ్యారు. 




అనంత్ - రాధికా వివాహ వేడుక - తరలివచ్చిన తారాలోకం

Anant Ambani Wedding: ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వైభవంగా సాగుతోంది. ఆయన కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ వేడుకకు  దేశవిదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. ముంబైలోని 'జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌'లో వివాహం జరగనుంది. పెళ్లి వేదిక వద్దకు అంబానీ కుటుంబం వరుడు అనంత్‌తో కలిసి వచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, నటులు సంజయ్ దత్, అనిల్ కపూర్, అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, క్రితిసనన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్యతో కలిసి వచ్చారు.






 

అంబానీ ఇంట పెళ్లికి ఏపీ సీఎం చంద్రబాబు

Anant Ambani Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకకు అతిరథ మహారథులు హాజరవుతున్నారు. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు సైతం కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. శనివారం వేడుకల్లో పాల్గొన్న అనంతరం, ఆదివారం అంబానీ నివాసం ఆంటీలియాలో జరగనున్న ఫంక్షన్‌కు హాజరవుతారు. అటు, పెళ్లి వేడుకలు వైభవంగా సాగుతుండగా.. అతిథుల కోసం అంబానీ ఫ్యామిలీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారికి ఖరీదైన బహుమతులు కూడా ఇస్తున్నారు.

కుమారుని వివాహ వేడుకల్లో ముకేశ్ అంబానీ భావోద్వేగం

Anant Ambani Wedding: అనంత అంబానీ - రాధికా మర్చంట్ వివాహ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరవుతున్నారు. ముందస్తు వేడుకల్లో భాగంగా మర్చంట్ కుటుంబం గృహ శాంతిపూజను నిర్వహించింది. ఈ సందర్భంగా కాబోయే వధూవరులిద్దరూ దండలు మార్చుకున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుచుకుంటూ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ దృశ్యాలను చూసిన ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. రాధిక తల్లిదండ్రులు సైతం అలాగే కనిపించారు. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. కాగా, శుక్రవారం రాత్రి వీరి వివాహం జరగనుంది.

అమెరికన్ రియాల్టీ షోలో అనంత్ - రాధిక వెడ్డింగ్!

Anant Ambani Wedding: అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహం ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు ప్రపంచ స్థాయి సెలబ్రిటీలు విచ్చేస్తున్నారు. అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్స్ కిమ్ కర్దాషియన్, ఖ్లో కర్దాషియన్ ఇప్పటికే వేడుకకు హాజరు కాగా.. వీరికి ఘన స్వాగతం లభించింది. వీరి వెంట ప్రొడక్షన్ బృందం సైతం వచ్చింది. వీరు వెడ్డింగ్ షూట్ చేయడానికి వచ్చినట్లు జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నాయి. హులు ఓటీటీ వేదికలో ప్రసారం అవుతోన్న 'ది కర్ధాషియన్స్' షోలో ఈ వేడుక ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. తదుపరి సీజన్‌లో పెళ్లి హైలైట్స్ వేస్తారని సమాచారం.

Anant Radhika Wedding Live Updates: వీవీఐపీ అతిథులకు కోట్ల విలువైన రిటర్న్ గిఫ్టులు

Anant Radhika Wedding Live Updates: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం చాలా గ్రాండ్‌గా  చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి దిగ్గజాలంతా పెళ్లికి హాజరవుతున్నారు. వారందరికీ తమ స్థాయికి తగ్గటుగానే అతిథి సత్కారాలు చేస్తోంది అంబానీ కుటుంబం.  వారికి స్వాగతం పలికినప్పటి నుంచి వీడ్కోలు చెప్పే వరకు ఏ మాత్రం తగ్గడం లేదు. అతిథులకు ఖరీదైన రిటర్న్ గిఫ్టులు కూడా ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్‌లో వీవీఐపీ అతిథులకు కోట్ల విలువైన గడియారాలు ఇస్తున్నట్టు సమాచారం. ఇతర అతిథులకు కశ్మీర్, రాజ్ కోట్, బెనారస్‌ల నుంచి ఆర్డర్ చేసిన గిఫ్ట్‌లు ఇవ్వనున్నారు. 

Anant Radhika Wedding Live Updates: అనంత్-రాధిక పెళ్లి వేడుకకు వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్

Anant Radhika Wedding Live Updates: అనంత్, రాధిక వివాహానికి బాలీవుడ్ సెలబ్రిటీలనే కాకుండా దేశంలోని రాజకీయ నాయకులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. అలా ఆహ్వానం అందుకున్న వారంతా ఒక్కొక్కరుగా వివాహ వేడుకకు వస్తున్నారు. కాసేపటి క్రితం లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీతో కలిసి ముంబై వచ్చారు. 

 Anant Radhika Wedding Live Updates: రాధికా మర్చంట్ పెళ్లి దుస్తులను డిజైన్ చేసిందెవరో తెలుసా?

 Anant Radhika Wedding Live Updates: అనంత్ అంబానీ పెళ్లిలో పెళ్లికుమార్తె రాధికా మర్చంట్ కోసం డ్రెస్‌లను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా పెళ్లి కుమార్తెతోపాటు అందరి డ్రెస్‌లను డిజైన్ చేశారు. అంబానీ ఫ్యామిలీ దగ్గరుండి ఈ డిజైన్ చేయించుకున్నారు. సంప్రదాయానికి ఆధునికతను జోడించి దుస్తులను తీర్చిదిద్దారు. 

 Anant Radhika Wedding Live: అనంత్, రాధిక పెళ్లి భోజనం కూడా చాలా ప్రత్యేకం

అనంత్, రాధిక వెడ్డింగ్ మెనూ కూడా చాలా ప్రత్యేకంగా వండించారు. 2500కుపైగా వంటకాలను మెనూలో చేర్చారు. అందులో 100కిపైగా వంటకాలను ఇండోనేషియా క్యాటరింగ్ కంపెనీ తయారు చేస్తోంది. వీటితో పాటు అంతర్జాతీయ చెఫ్‌లను కూడా పిలిపించి వంటలు వండిస్తున్నారు. ఈ వివాహానికి 10 మంది అంతర్జాతీయ చెఫ్‌లను పిలిచారు. పెళ్లిలో స్పెషల్ కాశీ చాట్, మద్రాస్ కేఫ్ ఫిల్టర్ కాఫీ ఉంది. ఇటాలియన్, యూరోపియన్ స్టైల్ ఫుడ్ కూడా పెళ్లి విందులో వడ్డిస్తారు. 

Anant Radhika Wedding Live Updates: అనంత్ రాధిక వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫుల్ షెడ్యూల్ ఇదే

అనంత్ రాధిక పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. జియో వరల్డ్ సెంటర్‌లో ఈ రాయల్ వెడ్డింగ్ జరగనుంది. అనంత్-రాధిక పెళ్లికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇదే
మధ్యాహ్నం 3 గంటలకు ఊరేగింపు నిర్వహిస్తారు. 
రాత్రి 8 గంటలకు ఇద్దర్నీ పెళ్లి వేదికపైకి తీసుకొస్తారు. 
రాత్రి 9.30 గంటలకు పెళ్లి లగ్నం
వివాహానికి వచ్చే అతిథులు సంప్రదాయ డ్రెస్ కోడ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
ఈ నెల 13, 14 తేదీల్లో వేర్వేరు వ్యక్తులకు ప్రత్యేక రిసెప్షన్లు ఏర్పాటు చేశారు.

Anant Radhika Wedding Live: అనంత్-రాధిక పెళ్లికి యూకే మాజీ ప్రధాని హాజరు 

Anant Radhika Wedding Live: అనంత్-రాధిక వివాహానికి హాజరయ్యేందుకు బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా భారత్‌ వచ్చారు. ప్రింటెడ్ చొక్కా, ప్యాంటు ధరించి పాపరాజీలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాంసంగ్ సీఈఓ హాన్ జోంగ్ హీ కూడా పాల్గొన్నారు.

Anant Radhika Wedding Live: అనంత్-రాధిక పెళ్లికి షారూఖ్ ఖాన్ హాజరు 

Anant Radhika Wedding Live: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం కోసం షారుఖ్ ఖాన్ ముంబైకి షూటింగ్‌ నుంచి తిరిగి వచ్చాడు. మీడియా కంట పడకుండా ఉండేందుకు గొడుగును ఉపయోగించాడు. కట్టుదిట్టమైన భద్రత మధ్య తెల్లటి రోల్స్ రాయిస్ కారులో వెళ్లిపోయాడు. అనంత్, రాధిక హల్దీ-సంగీత్ మెహందీ వేడుకకు షారుక్ హాజరు కాలేదు. ఇప్పుడు వివాహానికి హాజరు కానున్నట్లు సమాచారం. 

Anant Radhika Wedding Live: మూడు రోజుల పాటు అనంత్-రాధికల పెళ్లి

Anant Radhika Wedding Live:హిందూ సంప్రదాయం ప్రకారం ఇవాళ ప్రారంభమయ్యే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం మూడు రోజులు జరగనుంది. జులై 13న శుభప్రదమైన ఆశీర్వాదం, 14న వివాహ రిసెప్షన్ ఉంటుంది. ఆఖరి రోజు మంగళ ఉత్సవ్ నిర్వహిస్తారు. 

Background

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ వివాహం వైభవంగా ఇవాళ జరగనుంది. ఈ వివాహానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులంతా ముంబైకు క్యూ కట్టారు. 


ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం జరగనుంది. అనంత్-రాధిక వివాహానికి సంబంధించి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) ప్రాంతంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతోపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా విధించారు.  
ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుమారుడి వివాహానికి రాజకీయ, వ్యాపారం, బాలీవుడ్, హాలీవుడ్, క్రీడా రంగాలకు చెందిన  వీఐపీలంతా హాజరవుతున్నారు. వివిధ దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులను కూడా ఆహ్వానించారు.


తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. వారి పేరు షెడ్యూల్‌లో ఉంది కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. శనివారం ప్రధాని మోదీ ముంబైలో పర్యటించనున్నారు. ఇక్కడ పలు ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. గోరేగావ్‌లోని నెస్కో సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో గోరెగావ్-ములుంద్ లింక్ రోడ్డు మూడో దశ ప్రారంభిస్తారు. ఈ కారణంగా ప్రధాని పెళ్లికి హాజరు కాకపోతే రిసెప్షన్‌కు హాజరుకావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ప్రధాని బోరిస్ జాన్సన్, ఇటలీ మాజీ ప్రధాని మాటియో రెంజీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని విదేశీ మీడియా చెబుతోంది. అనంత్-రాధిక వివాహానికి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా కూడా హాజరుకానున్నారు.
ఈ వివాహానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అతిథులుగా హాజరయ్యారు.


భారతీయ అతిథుల జాబితా
జగదీప్ ధన్కర్ (ఉప రాష్ట్రపతి )
రాజ్ నాథ్ సింగ్ (రక్షణ మంత్రి)
శివరాజ్ సింగ్ చౌహాన్ (వ్యవసాయ శాఖ మంత్రి)
యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి)
మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి)
చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి)
నారా లోకేశ్, (ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి)
పవన్ కల్యాణ్ (డిప్యూటీ సీఎం )
ఎంకే స్టాలిన్, (తమిళనాడు ముఖ్యమంత్రి)
కేటీఆర్ (బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌)
అభిషేక్ మను సింఘ్వీ (కాంగ్రెస్ నేత, న్యాయవాది)
సల్మాన్ ఖుర్షీద్ (కాంగ్రెస్ నేత)
దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్ నేత)
కపిల్ సిబల్ (రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది)
సచిన్ పైలట్ (కాంగ్రెస్ నేత)
అంతర్జాతీయ అతిథుల జాబితా
జాన్ కెర్రీ (అమెరికా నాయకుడు)
టోనీ బ్లెయిర్ (బ్రిటన్ మాజీ ప్రధాని)
బోరిస్ జాన్సన్ (బ్రిటన్ మాజీ ప్రధాని)
మాటియో రెంజీ (ఇటలీ మాజీ ప్రధాని)
సెబాస్టియన్ కుర్జ్ (ఆస్ట్రియా మాజీ ప్రధాని)
స్టీఫెన్ హార్పర్ (కెనడా మాజీ ప్రధాని)
కార్ల్ బిల్డ్ (స్వీడన్ మాజీ ప్రధాని)
మొహమ్మద్ నషీద్ (మాల్దీవుల మాజీ అధ్యక్షుడు)
సామియా సులుహు హసన్ (టాంజానియా అధ్యక్షుడు )
అమీన్ నాజర్ (సౌదీ ఆరామ్కో సీఈఓ )
ఖల్దూన్ అల్ ముబారక్ (ముబదాలా సీఈఓ )
ముర్రే ఆచింక్లోస్ (బీపీ సీఈఓ )
రాబర్ట్ డడ్లీ (బీపీ అండ్ బోర్డ్ మెంబర్ ఆరామ్కో మాజీ సీఈఓ)
మార్క్ టక్కర్ (హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ పీఎల్సీ గ్రూప్ చైర్మన్ )
బెర్నార్డ్ లూనీ (బీపీ మాజీ సీఈఓ )
శంతను నారాయణ్ (అడోబ్ సీఈఓ )
మైఖేల్ గ్రిమ్స్ (మోర్గాన్ స్టాన్లీ మేనేజింగ్ డైరెక్టర్ )
జే లీ, (శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్)
దిల్హాన్ పిళ్లై (టెమాసెక్ హోల్డింగ్స్ సీఈఓ)
ఎమ్మా వాల్మ్స్లే (గ్లాక్సో స్మిత్క్లైన్ సీఈఓ)
డేవిడ్ కానిస్టేబుల్ (ఫ్లోర్ కార్పొరేషన్ సీఈఓ )
జిమ్ టీగ్ (ఎంటర్ప్రైజ్ జీపీ సీఈఓ )
గియానీ ఇన్ఫాంటినో (ఐఓసీ సభ్యుడు, ఫిఫా అధ్యక్షుడు)
ఖలీల్ మహ్మద్ షరీఫ్ ఫౌలతి (ఏడీఐఏ ఉపాధ్యక్షుడు )
పీటర్ డైమండ్స్ (ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సింగులారిటీ యూనివర్సిటీ)
జే శెట్టి (పాడ్కాస్టర్, రచయిత, కోచ్)
జెఫ్ కూన్స్ 
జాన్ మకాంబా 
జేమ్స్ టాక్లెట్ (లాక్ హీడ్ మార్టిన్ సీఈఓ )
ఎరిక్ కాంటర్ (వైస్ ప్రెసిడెంట్, మొయిలిస్ అండ్ కంపెనీ)
ఎన్రిక్ లోరెస్ (చైర్మన్ అండ్‌ CEO, HP Inc.)
బోర్జే ఎక్హోమ్ (ఎరిక్సన్ చైర్మన్ & సిఇఒ)
విలియం లిన్ (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, బీపీ)
టామీ ఉయిటో, (చైర్మన్, నోకియా మొబైల్ నెట్వర్క్స్)
జువాన్ ఆంటోనియో సమరంచ్ (వైస్ ప్రెసిడెంట్, ఐఓసీ)
కిమ్ కర్దాషియాన్ (హాలీవుడ్ నటి)
క్లోయి కర్దాషియాన్, (అమెరికన్ మీడియా పర్సనాలిటీ)
దినేశ్ పాలివాల్ (కేకేఆర్)
లిమ్ చౌ కియాట్ (సీఈఓ, జీఐసీ)
మైఖేల్ క్లీన్ (ఎం. క్లెయిన్ & కంపెనీ)
బదర్ మహమ్మద్ అల్ సాద్ (డైరెక్టర్, కేఐఐఏ)
యోషిహిరో హైకుటమ్ (సీఈఓ, ఎస్ఎంబీసీ)
క్లారా వు త్సాయ్ (జో అండ్ క్లారా త్సాయ్ ఫౌండేషన్)
పానో క్రిస్టో (సీఈఓ, ప్రెట్ ఎ మాంగర్)
మైక్ టైసన్ (అమెరికన్ బాక్సర్)
జాన్ సీనా (డబ్ల్యుడబ్ల్యుఇ సూపర్ స్టార్)
జీన్ క్లాడ్ వాన్ డామ్ (హాలీవుడ్ నటుడు)
కీనన్ వార్సేమ్ (గాయకుడు-ర్యాపర్)
లూయిస్ రోడ్రిగ్జ్ (గాయకుడు)
డివైన్ ఇక్యుబోర్ (గాయకుడు- ర్యాపర్)
సర్ మార్టిన్ సోరెల్ (డబ్ల్యూపీపీ వ్యవస్థాపకుడు)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.