Aditya-L1: చంద్రయాన్-3 విజయం ఇచ్చిన ఊపులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో.. ఆదిత్య ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ వేదికగా ఈ ప్రయోగం మొదలుకాబోతుంది. ఆదిత్య-ఎల్ 1 ను పీఎస్ఎల్వీ సి57 వాహక నౌక మోసుకెళ్లనుంది. సూర్యుడి దగ్గరి పరిస్థితులు, సౌర వ్యవస్థ, సౌర తుపానులు, వాతావరణం లాంటి పరిస్థితులపై ఆదిత్య- ఎల్1 అధ్యయనం చేయనుంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొరలను, వాతావరణాన్ని వివిధ వేవ్‌బ్యాండ్‌లలో పరిశీలించడానికి ఏడు పేలోడ్లను తీసుకెళ్లనుంది. ఇస్రో చేపడుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును నేరుగా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. https://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp లో రిజిస్టర్ చేసుకున్న వారు నేరుగా రాకెట్ లాంచ్ ను వీక్షించవచ్చు. 


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో చేపట్టనున్న ఆదిత్య - ఎల్1 ప్రయోగాన్ని చూసేందుకు వీలు కల్పించనుంది. https://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp లోకి వెళ్లగానే రిజిస్ట్రేషన్ బటన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే వివరాలు అడుగుతుంది. వాటిని ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. రిజిస్ట్రేషన్లు ఆగస్టు 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మొదలుకానున్నాయి. సుళ్లూరు పేట నుంచి శ్రీహరి కోట వరకు వెళ్లడానికి పబ్లిక్, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి ఆదిత్య - ఎల్1 ను మోసుకెళ్లి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ లాంచింగ్ ను వీక్షించవచ్చు. అలాగే స్పేస్ మ్యూజియంలో రోదసియానానికి, ఇస్రోకు సంబంధించిన విశేషాలు తెలుసుకోవచ్చు. 






175 రోజుల ప్రయాణం..


భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య వలయం లాంగ్రేజియన్ పాయింట్ -1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. భూమి నుంచి లాంగ్రేజియన్ పాయింట్ కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుందిి. లాంగ్రేజియన్ 1 పాయింట్ లో ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టడం వల్ల గ్రహణాల వంటివి పరిశోధనలకు అడ్డంకిగా మారవు. 


ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులు, సౌర వ్యవస్థ, సౌర తుపానులు సహా ఇతర పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. 


Also Read: UP Teacher: 'నేను తప్పు చేశాను, కానీ అందులో మతపరమైన విద్వేషమేమీ లేదు'


ఈ ప్రయోగం కోసం ఇస్రో ఏడు పేలోడ్స్ ను తీసుకెళ్లనుంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా(సూర్యుడి బయటి పొర) పై అధ్యయనం చేయడంలో ఉపయోగపడనున్నాయి. పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ సోలార్ మిషన్ కోసం పేలోడ్స్ ను అభివృద్ధి చేశాయి. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించనుంది ఇస్రో. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది. ఆదిత్య-ఎల్‌1లోని నాలుగు పేలోడ్‌లు నేరుగా సూర్యుడిని పరిశీలించనున్నాయి. మిగిలిన మూడు పేలోడ్‌లు ఎల్‌ - 1 పాయింట్ వద్ద కణాలు, క్షేత్రాలకు సంబంధించి పరిశీలనలు చేయనున్నాయి.