Swami Prasad Maurya:


ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు


సమాజ్‌వాదీ పార్టీకి చెందిన లీడర్ స్వామి ప్రసాద్ మౌర్య హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో రాంచరిత్‌ మానస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న మౌర్య..ఇప్పుడు మరోసారి నోరు జారారు. బ్రాహ్మణులు, హిందూ మతంపై చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అవుతున్నాయి. హిందూయిజం అనేదే లేదని అదంతా ఓ బూటకమని తేల్చి చెప్పారు. ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన ఆయన ఓ పెద్ద నోట్ రాశారు. అందులో అసలు హిందూయిజం అనే మతమే లేదని స్పష్టం చేశారు. కేవలం దళితులపై కుట్ర చేసేందుకే ఓ మతం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా హిందూ మతం ఉండి ఉంటే...వెనకబడిన వర్గాలకూ మేలు జరిగి ఉండేదని అన్నారు. 


"బ్రాహ్మణవాద మూలాలు చాలా లోతుగా మన సమాజంలో పాతుకుపోయాయి. సంఘంలో అసమానతలకూ ఈ బ్రాహ్మణవాదమే కారణం. హిందూ అనే మతమే మన దేశంలో లేదు. అదంతా ఓ బూటకం. కేవలం దళితులను, గిరిజనులను, వెనక బడిన వర్గాలపై చేసిన కుట్ర ఇది. బ్రాహ్మణ కులాన్నే హిందూ మతంగా ప్రచారం చేసుకున్నారు. నిజంగా హిందూ మతం ఉండి ఉంటే దళితులకు సముచిత గౌరవం దక్కేది. వెనక బడిన వర్గాలూ అభివృద్ధి చెందేవి"


- స్వామి ప్రసాద్ మౌర్య, సమాజ్‌వాదీ పార్టీ నేత