Mission Life Exhibition: 



న్యూయార్క్‌లో..


న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో భారత్‌ ఓ స్పెషల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది. Mission Life పేరిట గతంలో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. భారతీయ పౌరులందరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలనేదే మిషన్ లైఫ్ ముఖ్య ఉద్దేశం. సుస్థిర జీవనాన్ని (Sustainable Living) సాగించడాన్ని ప్రోత్సహించే విధంగా...ఐక్యరాజ్య సమితి చీఫ్ యాంటోనియా గుటెర్రస్‌,ప్రధాని నరేంద్ర మోదీ సంయుక్తంగా ఈ ఈవెంట్‌ని లాంఛ్ చేశారు. ఇందుకు సంబంధించి  UN కార్యాలయంలోనే రెండ్రోజుల ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేసింది భారత్. దౌత్యవేత్తలతో పాటు ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఆగస్టు 16న ఈ ఎగ్జిబిషన్ మొదలైంది. భారత్ తరపున ఐరాస శాశ్వత ప్రతినిధి రుచిర కాంబోజ్ హాజరయ్యారు. కలిసికట్టుగా ఓ స్ఫూర్తిమంతమైన ప్రయాణాన్ని మొదలు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. 


"మిషన్ లైఫ్ లక్ష్యాన్ని సాధించడానికి మనమంతా కలిసికట్టుగా ఓ స్ఫూర్తిమంతమైన ప్రయాణాన్ని మొదలు పెట్టాం. సుస్థిరమైన భవిష్యత్ కోసమే ఇదంతా. ఈ ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోదీ 2022 అక్టోబర్‌లో ఈ మిషన్‌ని ప్రారంభించారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వంతు సహకారం అందించాలి. మన రోజువారీ జీవన శైలిలో చిన్న చిన్న మార్పులతోనే ఎన్నో సాధించొచ్చు. పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తపడొచ్చు. పర్యావరణహిత విధానాలతో మన భవిష్యత్‌ని మనమే తీర్చి దిద్దుకోవచ్చు


- రుచిర కాంబోజి, ఐరాస భారత శాశ్వత ప్రతినిధి


పలు థీమ్స్..


ఈ ఎగ్జిబిషన్‌లో రకరకాల థీమ్స్‌ ప్రదర్శించారు. Save Energy, Save Water, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించడం, వ్యర్థాలను తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం, ఈ-వేస్ట్‌ని తగ్గించడం..ఇలా పలు లక్ష్యాలతో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. గతేడాది గుటెర్రస్, ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని కెవాడియాలో ఈ మిషన్‌ని లాంఛ్ చేశారు. Reduce, Reuse, Recycle విధానంతో పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని మోదీ పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఈ మిషన్‌పై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఐరాసలో ఎగ్జిబిషన్ నిర్వహించింది. భవిష్యత్ తరాల కోసం ఇప్పటి నుంచే కృషి మొదలు పెట్టాలని పిలుపునిచ్చింది. 


గ్లోబల్ బాయిలింగ్..


గ్లోబల్ వార్మింగ్. ఇప్పటి వరకూ మనం వింటున్న విషయమే. కానీ...వార్మింగ్ కాదు త్వరలోనే బాయిలింగ్ పాయింట్‌కి చేరుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు సైంటిస్ట్‌లు. అందుకు తగ్గట్టుగానే జులైలో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అది అలాంటి ఇలాంటి రికార్డు కాదు. లక్షా 20వేల సంవత్సరాల్లో ఈ స్థాయి ఉక్కపోత ఎప్పుడూ లేదని తేల్చి చెప్పారు శాస్త్రవేత్తలు. అంటే...ఇది ఎలాంటి రికార్డో అర్థం చేసుకోవచ్చు. గతంలోనూ ఇదే జులై నెలలో వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ...ఇప్పుడు నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే అది తక్కువే. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత (Global Avg Temp)కు 0.2 డిగ్రీల మేర పెరిగిపోయింది. ఇలా నంబర్స్ పరంగా చూసుకుంటే తక్కువే కదా అనిపించినా...అది పుట్టించే వేడి అంతా ఇంతా కాదు. అందుకే...2023 జులైని "చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెల"గా డిక్లేర్ చేశారు. జర్మనీకి చెందిన Leipzig University ఈ ఉష్ణోగ్రతలపై అనాలసిస్ చేసి ఈ విషయం వెల్లడించింది. 


Also Read: Prescriptions For Pesticides: పురుగుల మందులు కొనాలా? వ్యవసాయ అధికారుల నుంచి చీటీ ఉండాల్సిందే