అభిమన్యు, ఖైలాష్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు నీలాంబరి వింటుంది.


అభి: మాళవిక యష్ ఇంటికి చేరినప్పుడే అసలు కథ స్టార్ట్ అయ్యిందని అనుకున్నా. ఎందుకంటే తన సైకాలజీ నాకు తెలుసు. తను అనుకున్నది సాధించడం కోసం దేనికైనా తెగిస్తుంది. అలాగే వేద, యష్ నా టార్గెట్ రీచ్ అయ్యే రోజు రానే వచ్చింది. మాళవికని ఇంట్లో నుంచి గెంటేశారని నాకు తెలిసింది. తన మూమెంట్స్ మీద ఒక కన్నేశాను అని జరిగింది మొత్తం ఖైలాష్ కి చెప్తాడు. అది మ్యూజిక్ తో వినిపించకుండ చేస్తారు. యష్ వెళ్ళగానే మాళవికకి స్కెచ్ చెప్పి ట్రాప్ లో వేసుకున్నా. తనని లొంగదీసుకోవడం నాలాంటి వాడికి కష్టమే కాదు. ప్లాన్ పూర్తయ్యింది.. తను నాకు సరెండర్ అయ్యింది. మాళవికని ఫామ్ హౌస్ లో దాచేసి మర్డర్ ప్లాన్ వేసి పోలీసులకి ఉప్పందించాను. రంగంలోకి దిగారు పోలీసులు. యష్ అరెస్ట్ వేద ఆరాటం.. కోలుకోలేని దెబ్బ. ఇక మిగిలింది జడ్జిమెంట్. యశోధర్ కి ఉరి లేదంటే జీవిత ఖైదు. వేదకి జీవితాంతం వేదనే


నీలాంబరి: ఇంత దుర్మార్గుడివా? యష్ చేయని నేరానికి శిక్ష నో అలా జరగకూడదు


ఖైలాష్: నీ బ్రెయిన్ మామూలుది కాదు. కోర్టు తీర్పు ఎప్పుడు వింటానా? ఆ వేద నరకం ఎప్పుడు చూస్తానా అని ఆరాటంగా ఉంది


Also Read: అత్తని మంచానికి పరిమితం చేసిన తోడికోడళ్ళు- హాస్పిటల్ వ్యవహారాలు చూసుకుంటున్న విక్రమ్


వెంటనే నీలాంబరి పక్కకి వచ్చి వేదకి ఫోన్ చేస్తుంది. ఏ మాళవిక అయితే అందరూ చనిపోయింది అనుకుంటున్నారో తను చనిపోలేదు. మాళవిక బతికే ఉంది. తనని చంపినట్టు ఆ కేసు యష్ మీదకి వెళ్ళినట్టు ప్లాన్ చేసింది అభిమన్యు. మీరెంటో నాకు తెలుసు. నేను ఎవరు అన్నది సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతం మాళవిక అభిమన్యు అండర్ లోనే ఉంది. తను ఎక్కడ ఉందో పూర్తి డీటైల్స్ పంపిస్తాను అనేసి కాల్ కట్ చేస్తుంది. యష్ ని కోర్టుకి తీసుకుని వస్తారు. కన్నకొడుకుని ఆ పరిస్థితిలో చూసి మాలిని గుండె తరుక్కుపోతుంది. నేను ఈ ఉచ్చు నుంచి బయట పడి అసలు నేరస్తులు దొరకాలంటే వేద చాలా ముఖ్యం. తను ఇంకా రాలేదు ఏంటని యష్ చూస్తాడు.


నీలాంబరి చెప్పిన లొకేషన్ కి వేద బయల్దేరుతుంది. తన కారు ముందే అభిమన్యు కారు కూడా వెళ్తుంది. అటు కోర్టులో వాదనలు మొదలవుతాయి. స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ ని యష్ ప్రశ్నించాలని జడ్జిని అడుగుతాడు.


యష్: మీరు రాసే ఎఫ్ఐఆర్ ఎవరూ మార్చి రాయలేరు. ఎఫ్ఐఆర్ తయారు చేసే ముందు మీకు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు


ఎస్సై: అభిమన్యు ఇచ్చాడు. అతను నా దగ్గరకి రాలేదు ఫోన్ చేసి విషయం చెప్పాడు


యష్: ఫోన్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు. అభిమన్యు నుంచి ఫోన్ రాగానే యాక్షన్ లోకి దిగారు. ఆ హత్య జరగడం అభిమన్యు చూశాడా? అక్కడే ఉన్నాడా? అక్కడికి వెళ్ళి ప్రతిఘటించాడా?


ఎస్సై: హత్య జరగడం అతను చూడలేదు. అక్కడ లేడు


యష్: మరి హత్య జరిగినట్టు ఊహించారా?


Also Read: రాజ్ కి ఉప్మా కష్టాలు- అపర్ణ బుర్రలో విషం నింపుతున్న రుద్రాణి


ఎస్సై: యష్ నన్ను చంపుతున్నాడు నన్ను కాపాడు అని హత్యకి గురైన మాళవిక అభిమన్యుకి మెసేజ్ పెట్టింది. అది మాకు పంపించాడు


యష్: మాళవిక అభిమన్యుకి మాత్రమే ఎందుకు మెసేజ్ పెట్టింది


ఎస్సై: వాళ్ళు లివింగ్ టు రిలేషన్ షిప్ లో ఉన్నారు


యష్: వాళ్ళు ఎప్పుడో విడిపోయారు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అభి మాళవికని వెళ్లగొట్టాడు. చంపబడిన మృతదేహాన్ని సంబంధిత వ్యక్తులకి అప్పజెప్పాలి. ఆ మృతదేహం ఆడది కనుక తన ఒంటి మీద ఆభరణాలు ఉండాలి కదా. వాటిని సీజ్ చేసి కోర్టుకి ఇచ్చారా?


ఎస్సై: మాళవికని హత్య చేసి పెట్రోల్ పోసి ఆనవాళ్ళు లేకుండా తగలబెట్టారు. ఆమె ఒంటి మీద ఏవైనా ఉంటే కాలి బూడిద అయ్యాయి. ఈ విషయాన్ని అభిమన్యుకి తెలియజేశాం. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య లివింగ్ రిలేషన్ షిప్ ఉన్నట్టు అగ్రిమెంట్ చూపించాడు. అది మాకు చూపించి నేనే తనకి సంబంధించిన వ్యక్తి అని చెప్పారు. ఆ అగ్రిమెంట్ మా దగ్గర ఉంది


జడ్జి: హంతకుడు మృతదేహాన్ని తగలబెట్టాడు అనడానికి సాక్ష్యం ఉందా?


లాయర్: ఉంది మేడమ్ ప్రత్యక్ష సాక్షి


ఇక సీన్ మాళవిక దగ్గరకి వస్తుంది. అభిమన్యు మాళవిక దగ్గరకి వస్తాడు. అన్నీ జాగ్రత్తగా ఏర్పాటు చేశాను జడ్జిమెంట్ ఫైనల్ అవుతుంది. ఉరి లేదా జీవితాంతం జైలుకే.