ఇల్లు అమ్మేందుకు కృష్ణమూర్తి బయల్దేరతాడు. కాంట్రాక్ట్ పోయింది దాని వల్ల వచ్చే ఆదాయం పోయింది, పది లక్షలు అప్పు తీర్చే మార్గం పోయింది. ఇక మనం ఎంత కష్టపడినా ఇల్లు అమ్మడం తప్ప వేరే దారి లేదని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే రాజ్ కావ్యని తీసుకుని ఇంటికి వస్తాడు. కారులో నుంచి కావ్య బ్యాగ్ తీసుకుని రావడం చూసి కంగారుపడతారు. కావ్యని అత్తవారింటి నుంచి పంపించేశారు. అది దీనంగా బతిమలాడుతున్నా అల్లుడు కరగడం లేదని కనకం ఏడుస్తుంది.
కనకం: కాంట్రాక్ట్ పోయిందని అనుకున్నా. నీ కాపురం కూడా ముక్కలైపోయిందా
కృష్ణమూర్తి: అల్లుడు మీకు ఇది భావ్యం కాదండీ అనేసరికి రాజ్ కారు నుంచి దిగుతాడు.
కనకం: మా కావ్యని ఇంటికి తిరిగి తీసుకెళ్లండి
రాజ్: వద్దు వద్దు మా తాతయ్య ఊరుకోరు
కనకం: అంత మంచి మనసు ఉన్న పెద్దాయన కూడా ఒప్పుకోలేదా?
కృష్ణమూర్తి: మీకు మాటిస్తున్నా ఇంకెప్పుడు నా కూతురు నా గడప తొక్కదు
Also Read: ట్విస్టుల మీద ట్విస్టులు, అభిమన్యుతో చేతులు కలిపిన మాళవిక - వేద మీద రౌడీల అటాక్
కనకం: బ్యాగ్ తో వచ్చావా? ఒక్క బ్యాగ్ తో వచ్చావ్ అంటే మొత్తం బట్టలు కూడా సర్దుకోవడానికి మనసు ఒప్పుకోలేదు
కావ్య: ఆపండి అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు. మా ఆయన నన్ను వదిలేయలేదు. తాతయ్య నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటే డ్రాప్ చేయడానికి వచ్చారు. ఇక్కడ విగ్రహాలు తయారు చేయడానికి
కృష్ణమూర్తి: ఇంకెక్కడ కాంట్రాక్ట్ పోయింది కదా
రాజ్: కాంట్రాక్ట్ పోలేదు ఇంట్లో గోడవలకి కారణం అవుతుందని నేనే క్యాన్సిల్ చేయించాను. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ మళ్ళీ తిరిగి ఇవ్వమని చెప్పాను
ఆ మాట చెప్పగానే కృష్ణమూర్తి వాళ్ళు సంతోషపడతారు. ఇక అల్లుడిని ఇంట్లోకి రమ్మంటే ఆఫీసుకి వెళ్తానని అంటాడు. దీంతో కావ్య ఫోన్ చూపిస్తుంది. టిఫిన్ చేసి వెళ్ళమని కనకం అడుగుతుంది. వద్దని అంటే కావ్య ఫోన్ చూపిస్తే టిఫినే కదా చేసేసి వెళ్ళమని బెదిరింపుగా మాట్లాడేసరికి తల ఆడిస్తాడు. రెండు నిమిషాల్లో చేసేస్తానని కనకం ఇంట్లోకి వెళ్ళిపోతుంది. రెండు నిమిషాల్లో చేసే టిఫిన్ ఏంటని రాజ్ అంటే ఉప్మా అంటుంది.
అపర్ణ: మావయ్య మీరు కావ్య విషయంలో చేస్తుంది కరెక్ట్ కాదు. మావయ్యని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. కానీ కావ్య విషయంలో మావయ్య ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు
సీతారామయ్య: అంటే కావ్యని పుట్టింటికి పంపించకుండా అడ్డుపడి ఉండాల్సిందని చెప్తున్నావా
అపర్ణ: లేదు మావయ్య అది మీరు తీసుకున్న నిర్ణయం. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ మాటకి ఇచ్చి ఒప్పుకున్నా. తనని ఇంటి దగ్గర దింపడం కోసం రాజ్ ని పంపించడం నాకు నచ్చలేదు. కావ్య చేసే పని రాజ్ కి కూడా నచ్చలేదు. ఇప్పుడు కూడా వాడికి ఇష్టం లేకపోయినా మీరు చెప్పారని తీసుకెళ్ళాడు. తను ఎలా ఉన్నా ఎన్ని తప్పులు చేసినా తోడుగా మీరు ఉన్నారని భర్తని కూడా ఎదిరిస్తుంది. ఇక రాజ్ కి ఏం విలువ ఉంటుంది
సీతారామయ్య: కావ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్. తను తన కళని ఉపయోగించుకుంటుంది. నా భయం అంతా ఇంట్లో జరుగుతున్న గొడవలకి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని. అందుకే రాజ్ ని ఇచ్చి పంపించాను. ఏ అత్త అయినా కోడలిని కూతురిగా చూడాలని అనుకుంటుంది. కానీ నువ్వు కోడలిగా కూడ చూడటం లేదు. ముందు తనని అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి
అపర్ణ కోపంతో రగిలిపోతుంటే రుద్రాణి మరింత ఆజ్యం పోయాడానికి రెడీ అవుతుంది. తన దగ్గరకి వెళ్ళి మాట్లాడుతుంది. కావ్య గురించి ఎక్కించడానికి చూస్తుంది.
రుద్రాణి: ఒక్కసారి కావ్యతో రాజ్ ఆ ఇంటికి వెళ్తే ఎలా మార్చేసింది చూశావ్ కదా. తను చెప్పిన మాట వింటున్నాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పు
అపర్ణ: నువ్వు అంత బాధపడకు నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది
రుద్రాణి: తల్లివి కాబట్టి నమ్మకంగా ఉండటం తప్పు కాదు కానీ ఎంత కాదనుకున్నా రాజ్ కూడా అందరీలాంటి అబ్బాయి కదా. రాజ్ ని కావ్య పడేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి. రాజ్ సపోర్ట్ చేస్తే అసలు తను ఎవరి మాట అయినా వింటుందా
Also Read: మురారీకి భార్యగా మారిన ముకుంద- నందు చేసిన ప్రయత్నంతో కృష్ణకి మురారీ ప్రేమ తెలుస్తుందా?
అపర్ణ: నువ్వు అంత జాలి చూపించాల్సిన పని లేదు. రాజ్ మీద నాకు నమ్మకం ఉంది. అయిన నువ్వు చెప్పినట్టు జరగడానికి రాజ్ వెళ్ళింది కావ్యని డ్రాప్ చేయడానికి మాత్రమే
రుద్రాణి: కానీ కనకం ఊరుకోదు కదా. ఇప్పుడు ఆ తల్లీకూతుళ్లు కలిస్తే రాజ్ మారకుండా ఉంటాడా? అని అగ్గి రాజేస్తుంది
ఉప్మా చూసి రాజ్ కాసేపు తిట్టుకుంటాడు. ఉప్మా కనిపెట్టిన వాడిని ఉప్మా తినిపించి చంపేయాలని కామెడీ చేస్తాడు. కావ్య ఉప్మా తిననని అనేసరికి రాజ్ తనకి బలవంతంగా నోట్లో తోస్తాడు. అది చూసి కనకం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజ్ వాళ్ళని చూసేసరికి సిగ్గుపడుతూ వెళ్లిపోతారు. అప్పుడే కాంట్రాక్ట్ ఇచ్చేందుకు శ్రీనివాసరావు వస్తాడు. విగ్రహాలు చాలా అవసరమని అంటాడు.
కావ్య: మధ్యలో మళ్ళీ డ్రాప్ అవరని గ్యారెంటీ ఏంటి? కాంట్రాక్ట్ పూర్తి అయ్యే వరకు మధ్యలో ఇలాంటి వాళ్ళు ఫోన్ చేసినా వదులుకోనని అగ్రిమెంట్ మీద రాసి ఇవ్వాలి. ఆ హామీ ఇవ్వకపోతే నేనేమీ చేయలేను
శ్రీను: రాసిస్తాను రాయక చస్తానా? అని అగ్రిమెంట్ రాస్తాడు
కావ్య: ఇది రాసినా కూడా మాట తప్పారని గ్యారెంటీ ఏంటి? సాక్షి సంతకం కావాలి
రాజ్: ఇప్పటికిప్పుడు సాక్షి సంతకం ఎక్కడ నుంచి తీసుకొస్తాడు
కావ్య: మీరు ఉన్నారుగా
రాజ్: వామ్మో నేనా.. సరే ఒక కండిషన్ ఉప్మా మాత్రం తినను
కావ్య: సరే పర్మిషన్ ఇస్తున్నా అనేసరికి రాజ్ సైన్ చేస్తాడు. దీంతో శ్రీను వెళ్ళిపోతాడు. మరి ఉప్మా సంగతి ఏంటని రివర్స్ అవుతుంది. తినను అనేసి రాజ్ ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోతాడు. కావ్య ఆగమని వెంట పడుతూ ఉంటే రాజ్ వెళ్ళి బొమ్మల కోసం పోసిన మట్టిలో కాలు వేస్తాడు.
రేపటి ఎపిసోడ్లో..
కావ్య ఇంటికి రాగానే అపర్ణ గొడవ మొదలుపెడుతుంది. తన కొడుకుని కూలి వాడిని చేసి మట్టి తొక్కించినందుకు అరుస్తుంది. డిజైన్స్ వేసి ఆ డబ్బు మా ఇంటికి తీసుకెళ్తే నచ్చదు. నా భర్త నన్ను సపోర్ట్ చేస్తే తట్టుకోలేరు. ఎక్కడ భార్యగా ఒప్పేసుకుంటాడోనని భయం. ఎక్కడ మేమిద్దరం అయిపోతామేమోనని భయం. అసలు మీరు మీ కొడుక్కి కన్న తల్లేనా? అనేసరికి రాజ్ కోపంగా కావ్య మీదకి చెయ్యి ఎత్తుతాడు.