Income Tax department recovers Rs 37,000 crore from individuals not filing returns despite taxable income: దేశంలో ఆదాయం ఉన్నా టాక్స్ కట్టని వారు చాలా మంది ఉన్నారు. మన దేశంలో ఆదాయపు పన్ను కట్టే వారు  ఐదు శాతం లోపే ఉంటారని అంచనా . మిగతా 95 శాతం మందికి టాక్స్ కట్టడం లేదు. వీరిలో అరవై శాతం మందికి పన్ను కట్టేంత ఆదాయం ఉండకపోవచ్చు కానీ మిగిలిన వారికి ఆదాయం ఉంటుంది. అయితే వారు పన్నులు కట్టడం లేదు. పన్నులు తప్పించుకునేందుకు అసలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం లేదు. 


దేశంలో ఉద్యోగం చేసేవారి దగ్గర జీతం నుంంచే టీడీఎస్ కట్ చేసుకుంటారు. మిగతా రంగాల్లో సంపాదించుకునేవారికి ప్రత్యేకంగా ఎలాంటి టీడీఎస్ కట్ అవదు. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు, ఇతర ఆదాయ వర్గాల వారు స్వచ్చందంగా ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఈ పన్ను కట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఎవరికి వారు టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే అసలు పన్ను కట్టాల్సిన పని లేదుగా అని లైట్ తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి నుంచి పన్ను రాబట్టేందుకు ఐటీ శాఖ తమదైన పద్దతిలో నిఘా పెట్టి మరీ వసూళ్లు చేస్తోంది.


Also Read: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?


గత ఇరవై నెలల్లో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయని వాళ్ల దగ్గర నుంచి కనీసం రూ. 37వేల కోట్లను ఐటీ శాఖ అధికారులు వసూలు చేసినట్లుగా తాజాగా నివేదిక వెలుగులోకి వచ్చింది. చాలా మంది పన్నులు తగ్గించుకోవడానికి నగదు రూపంలో ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారు. ఇలాంటి వారు భారీగా జ్యూయలరీని కొనుగోలు చేయడం, లగ్జరీ హాలీడేస్ ను ఎంజాయ్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలా పరిమితికి మించి ఖర్చు పెడుతున్న వారిని గుర్తించి వారి ఆదాయాన్ని ఐటీ శాఖ బయటకు తీసింది. నోటీసులు జారీ చేసింది. వారి ఆదాయాలకు ఫ్రూఫ్ లు చూపించి పన్నులు కట్టకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దాంతో వారంతా దిగి వచ్చారు. 


Also Read:  ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో


ఇరవై నెలల్లో రూ. 37వేల కోట్లు ఇలా రిటర్న్స్ ఫైల్ చేయని వాళ్ల దగ్గర నుంచి వసూలు చేయడం ఓ రికార్డుగా మారింది. నిజానికి నోట్ల రద్దు తర్వాత పన్నులు కట్టేవారు పెరిగారు కానీ ఆశించినంతగా పెరగలేదు. దీంతో పన్నులు ఎగ్గొట్టేందుకు తమ వద్ద ఉన్న అన్నిరకాల ఉపాయాలను ప్రయోగిస్తున్నారు. వారికి విరుగుడుగా ఐటీ శాఖ తమ ప్లాన్లను అమలు చేస్తోంది. అయితే దేశంలో పన్నులు కట్టే వాళ్లంతా దేశం కోసం పన్నులు కట్టాలని ఇలా ఎగ్గొట్టడం వల్ల దేశాభివృద్దికి ఆటంకం కల్పిస్తున్నారని ఐటీ అధికారులు అంటున్నారు.