Srikakulam Crime News : శ్రీకాకుళం జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి రోజూ ఏదో ప్రాంతంలో ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చైన్‌స్నాచర్లు ఏకంగా ఓ ఉపాధ్యాయురాలిపై హత్యాయత్నం చేశారు. బంగారం కోసం ప్రయత్నించి ఇవ్వకపోవడంతో హతమార్చేందుకు ట్రై చేశారు.
శ్రీకాకుళంజిల్లా కవిటి మండలంలో సోమవారం ఉదయాన్నే ఘోరం జరిగింది. బొర్రపుట్టుగ గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు భారతి ఉదయాన్నే స్కూల్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి వచ్చిన చైన్ స్నాచర్లు మొహానికి ముసుగులు వేసుకొని ఉన్నారు. ఒకరు హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు. ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారాన్ని లాక్కునేందుకు యత్నించారు.
కేటుగాళ్ల ప్రయత్నాన్ని అడ్డుకున్న భారతి... వారితో ఫైట్ చేశారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అయితే బంగారం ఇవ్వలేదని కసితో ఆమెపై వారు దాడి చేశారు. ఈ పెనుగలాటలో ఆమె కిందపడిపోయారు. దీంతో ఆమె తలకు బలమైన గాయాలు అయ్యాయి.
భారతి కేకలు విన్న స్థానికులు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. ఇంతలో చైన్ స్నాచర్లు పరారయ్యారు. గాయాలైన భారతీని స్థానికులు కవిటిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అలా వెళ్తూనే ఈదుపురంలో ఓ మహిళ వద్ద 3 తులలా పుస్తిలతాడు చోరీ చేశారు.
Also Read: శ్రీకాకుళం జిల్లా దొంగనోట్ల కేసులో కీలక పరిణామం- ఆరు ప్రత్యేక బృందాలతో విచారణ
ఉపాధ్యాయురాలి మెడలో నుంచి బంగారం లాక్కునేందుకు యత్నించిన దొంగలు... విఫలమయ్యారు. అయితే అ రూట్‌లోనే వెళ్తూ వెళ్తూ ఈదుపురంలో మరో మహిళపై అటాక్ చేశారు. స్కూటీపై తన బిడ్డతో వెళ్తున్న ఆమెకు ఈదుపురం వెళ్లేందుకు దారి ఎటు అని అడిగారు. ఆమె రోడ్డులోనే వెళ్లండని అని చెబుతుండగానే చైన్ స్నాచర్లు అటాక్ చేశారు. ఆమె మెడలోని పుస్తెల తాడు లాక్కొని పరారయ్యారు. ఆ వ్యక్తి తెల్లగా వెనుక బ్యాక్ వేసుకొని ఉన్నాడని బాధిత మహిళ చెబుతోంది.
ఈ మధ్య కాలంలో ఉద్దానం ప్రాంతంలో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. ఉదయాన్నో సాయంత్రం రోడ్డుపై ఒంటరిగా కనిపించే ఆడవాళ్లను చైన్ స్నాచర్లు టార్గెట్ చేసుకుంటున్నారు. రవాణా వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉన్న ఈ ప్రాంతంలో జనం సాధారణంగా చిన్న చిన్న దూరాలకు కాలినడకన వెళ్తుంటారు. ఇదే చైన్ స్నాచర్లకు వరంగా మారుతోంది.
ఎవరూ లేని ప్రాంతాల్లో కాపు కాచి దాడులు చేస్తున్నారు. ఇప్పటికే చాలా కేసులు నమోదు అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పరిసరాల్లో కూడా దొంగల బీభత్సం సృష్టించారు.
Also Read: ఒకరితో మొదలై వంద మంది మహిళలకు ఉపాధి- ఆదర్శంగా శ్రీకాకుళం జిల్లాలోని సీతానగరం