OpenAI whistleblower Suchir Balaji sudden death: ఓ యువ టెకీ అనుమానాస్పద మృతి ఇప్పుడు అమెరికా టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ఈ టెకీ వయసు ఇరవై ఆరేళ్లు మాత్రమే. కానీ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన ఓపెన్ ఏఐ గురించి అనేక సంచలన విషయాలు బయట పెట్టారు. అనేక అక్రమాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో ఆయన చనిపోవడం సంచలనంగా మారింది.             

భారత సంతతికి చెందిన టెకీ సుచిర్ బాలాజీ                   

భార‌త సంత‌తికి చెందిన  సుచిర్ బాలాజీ శాన్‌ఫ్రాన్సిస్‌కోలో  అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించాడు. న‌గంర‌లోని బుచాన‌న్ స్ట్రీట్ అపార్ట్‌మెంట్‌లో సుచిన్ బాలాజీ  నిసిస్తూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్లు బాలాజీ స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూశారు. అయితే ఆత్మహత్య చేసుకున్నాడని వాుర బావిస్తున్నారు. మ‌ర‌ణం వెనుక ఎటువంటి ఆధారాలు లేవ‌ని పోలీసులు చెప్పారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో పేరుగాంచిన ఓపెన్ఏఐ సంస్థ‌లో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను సుచిర్ బాలాజీ విజిల్ బౌలర్ రూపంలో వెలుగులోకి తెచ్చాడు. 

Also Read:  ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో

చాట్ జీపీటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సుచిర్ బాలాజీ                                       

ఓపెన్ ఏఐ కంపెనీ  అనుస‌రిస్తున్న వ్యాపార విధానాలపై ఇప్పటికే ఎన్నో విమర్శలుఉన్నాయి. అలాగే అమెరికా కోర్టుల్ోల ప‌లు దావాలు దాఖ‌లు అయ్యాయి. ఓపెన్ఏఐ సంస్థ అమెరికా కాపీరైట్ చ‌ట్టాల‌ను ఉల్లంఘించిన‌ట్లు  సుచిర్ బాలాజీ కీలక విషయాలను వెల్లడించారు. అన్నిరకాల చట్టాలను ఉల్లంఘించి ఆ కంపెనీ అక్ర‌మ‌రీతిలో చాట్‌జీపీటీ డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు సుచిర్ బాలాజీ వెల్లడించాడు.  ఓపెన్ఏఐ సంస్థ వ్యాపార‌వేత్త‌ల‌ను, ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను వేధిస్తున్న‌ట్లు బాలాజీ ఆరోపించారు. స‌మాజానికి హాని చేసే సంస్థ‌లో ఉండ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఓపెన్ఏఐ సంస్థ‌ను బాలాజీ వ‌దిలివెళ్లినట్లుగా ప్రకటించాడు. అప్పట్నుంచి ఓపెన్ ఏఐకి చెందిన కీలక విషయాలను వెల్లడిస్తున్నాడు. ఈ లోపే అనుమానాస్పదంగా చనిపోవడం సంచలనంగా మారింది. 

Also Read: Deadly Virus Samples Missing: ఆస్ట్రేలియాలోని ప్రయోగశాల నుంచి ప్రాణాంతక వైరస్ నమూనాలు మిస్సింగ్.. క్వీన్స్‌లాండ్ ప్ర‌భుత్వం సంచలన ప్ర‌క‌ట‌న‌

ఆత్మహత్య చేసుకున్నారా ?                                  

సుచిర్ బాలాజీ భారత సంతతకి చెందిన టెకీ. ఆయన కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓపెన్ ఏఐ కంపెనీలో ఇంటర్నీగా వెళ్లాడు. అతని ప్రతిభను గుర్తించడంతో అక్కడే ఇంజినీర్ గా చేర్చుకున్నారు. చాట్ జీపీటీతో పాటు అనేక సాఫ్ట్ వేర్లను అభివృద్ధి చేయడంలో కీలక పాత్రపోషించాడు. కానీ ఇప్పుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు.  ఎలాన్ మస్క్ కూడా ఈ టెకీ మృతిపై స్పందించారు.