Tax on Netflix:


ఇన్‌కమ్‌పై ట్యాక్స్..! 


భారత్‌లో ఐటీ శాఖ నెట్‌ఫ్లిక్స్‌పై (Tax on Netflix in India) ట్యాక్స్ వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో స్ట్రీమింగ్ సర్వీసెస్‌ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఓ రిపోర్ట్ ఇదే విషయాన్ని వెల్లడించింది. ఇదే ఆచరణలోకి వస్తే...విదేశీ డిజిటల్ కంపెనీలపై పన్ను విధించడం ఇదే తొలిసారి అవుతుంది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ కామర్స్ సర్వీసెస్ అందించే కంపెనీల్లో నెట్‌ఫ్లిక్స్‌ తొలిసారి ఈ ట్యాక్స్‌ను ఎదుర్కొనే అవకాశముంది. ఇందుకు ప్రధాన కారణం...నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌లో పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ ( Permanent Establishment) అవ్వడమే. అమెరికాలో హెడ్‌క్వార్టర్స్ ఉన్నప్పటికీ...ఇండియాలోనూ పెద్ద ఎత్తున సర్వీసెస్ అందిస్తోంది ఈ సంస్థ. ప్రపంచంలోనే పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌లోనూ బాగానే సంపాదిస్తోందన్న విషయం ఐటీ శాఖ దృష్టికి వచ్చింది. ఓ రిపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం...2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ రూ.55 కోట్లు ఆర్జించిందని ఐటీ అధికారులు తెలిపారు. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు ఉద్యోగులున్నారని, ఆఫీస్‌లు కూడా ఉన్నాయని చెప్పారు. పేరెంట్ కంపెనీ నుంచి పెద్ద ఎత్తున నిధులూ వస్తున్నాయని తేలింది. అందుకే...ఈ సర్వీస్‌ని Permanent Establishmentగా పరిగణిస్తున్నట్టు ఐటీ శాఖ వివరించినట్టు తెలుస్తోంది. 


పెరిగిన ఆదాయం..


2016లో భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సర్వీస్‌లు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ఇండియాలో దాదాపు 60 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ (Netflix Subscribers in India) ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ వైస్‌ప్రెసిడెంట్ మోనికా షెర్‌గిల్ (Monica Shergill) గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏటా ఇండియాలో స్ట్రీమింగ్ అవర్స్ (Netflix Streaming Hours)30% మేర పెరుగుతున్నాయని వెల్లడించారు. అంతకు ముందుతో పోల్చితే రెవెన్యూ కూడా 25% మేర పెరిగిందని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్‌కి ఇండియా చాలా కీలకమైన మార్కెట్. 2022లో అంతర్జాతీయంగా చూస్తే ఇండియా నుంచే ఎక్కువ  మంది సబ్‌స్క్రైబర్స్‌ వచ్చారు. 


పాస్‌వర్డ్ షేరింగ్‌పై కీలక నిర్ణయం..


పాస్‌వర్డ్ షేరింగ్‌ను త్వరలో ముగించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇటీవల ప్రకటించింది. తన సబ్‌స్క్రిప్షన్ల సంఖ్యను పెంచుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నందున సబ్‌స్క్రైబర్లకు ఈ విషయం తెలిపింది. ఇప్పుడు, కంపెనీ తన FAQ (తరచుగా అడిగే ప్రశ్నలు) పేజీని మరిన్ని వివరాలతో అప్‌డేట్ చేసింది. ఇద్దరు వేర్వేరు వినియోగదారులు ఒకే ఖాతాను ఉపయోగించకుండా ఎలా ఆపివేస్తుంది? మీ ఇంట్లో నివసించని వ్యక్తులు సిరీస్‌లు, సినిమాలు చూడటానికి వారి సొంత ఖాతాలను ఉపయోగించాల్సి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ స్పష్టంగా పేర్కొంది. FAQ సెక్షన్‌లో మీ నెట్‌ఫ్లిక్స్ ఇంట్లో లేని డివైస్ నుంచి ఎవరైనా మీ ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు లేదా మీ బయట నుంచి మీ ఖాతాను నిరంతరం యాక్సెస్ చేసినట్లయితే, కంపెనీ ఆ డివైస్‌ను వెరిఫై చేయాలని కోరనుంది. వినియోగదారులు షేరింగ్ చేయకుండా వారి స్వంత వ్యక్తిగత ప్లాన్‌లను పొందాలని కంపెనీ సిఫార్సు చేస్తుంది. వారు ఇప్పటికీ అదే ఖాతాను ఉపయోగించాలనుకుంటే, వినియోగదారులు మరిన్ని ప్రొఫైల్‌లను క్రియేట్ చేయవచ్చు. అయితే అది సొంత ప్లాన్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది.


Also Read: ఆ ప్రభుత్వ ఉద్యోగి నెల జీతం రూ.30 వేలు, ఆస్తులు మాత్రం రూ.7 కోట్లు - అవాక్కైన అధికారులు