ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయడం అనే పద్దతిని కొన్నాళ్లుగా అవలంభిస్తున్నారు. ప్రముఖుల నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పోటీ చేయడం ఈ నిరసనలో భాగం. అలాగే ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ వందల మంది నామినేషన్లు వేయడం కూడా నిరసనలో భాగమే. హుజురాబాద్ ఉపఎన్నికల్లోనూ ఆ పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నిరుద్యోగ, చిరుద్యోగ వర్గాలు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 


హుజురాబాద్‌లో నామినేషన్ల నిరసన ! 


హుజురాబాద్ బరిలో ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న అనేక వర్గాలు ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. నిరుద్యోగులతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నామినేషన్లు వేయించాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ను కూడా నియమించారు. 200 మంది నిరుద్యోగులు బరిలో నిలుచుంటారని.. వారందరికీ తాము సాయం చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది.  మరో వైపు ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చడం లేదన్న కారణంతో  1000 మంది వరకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. ప్రతీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసేందుకు కనీసం రూ.10వేల ధరావతు, అభ్యర్థికి మద్దతిస్తూ స్థానికంగా పదిమంది సంతకాలు చేయాలి. వీరిలో ఎంత మంది అ నిబంధనల ప్రకారం నామినేషన్లు వేస్తారో కానీ..  అభ్యర్థులు మాత్రం ఎక్కువ సంఖ్యలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. 


Also Read : కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు బీసీలకు మాత్రం కులవృత్తులా...?


నిజామాబాద్‌లో 245 మంది పోటీ !


గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో   రైతులు ఎన్నికల్లో పోటీ చేసి నిరసన తెలిపారు.  రైతులు, వారి ప్రతినిధులే 236 మంది పోటీకి దిగారు.  పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరలను పెంచాలని నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లోని రైతులు ప్రతీ ఏటా ఆందోళన చేస్తూనే ఉంటారు.కానీ వారి డిమాండ్లు ఎప్పటికీ తీరలేదు. ఎన్ని ఆందోళనలు చేసిన స్పందన కనిపించలేదని అందుకే ఎన్నికల్లో మూకుమ్మడి నామినేషన్లు వేసి నిరసన తెలిపారు. ఈ కారణంగా దేశం మొత్తం నిజామాబాద్ అంశం చర్చకు వచ్చింది. 


Also Read: తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు.. నన్ను గెలిపించండి: ఈటల రాజేందర్


అత్యధిక నామినేషన్ల రికార్డు నల్లగొండదే ! 


నామినేషన్లతో నిరసన తెలియచేయడం అనేది ఎప్పటి నుండో ఉంది. 1996 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి ఏకంగా 515 మంది నామినేషన్లు వేశారు. కి సాగు, తాగు నీటి సౌకర్యం కల్పించాలని జలసాధన సమితి నేతృత్వంలో స్థానికులు ఇలా నామినేషన్ వేసి నిరసన తెలిపారు. ఇప్పటి వరకు ఒక పార్లమెంట్ స్థానం నుంచి అత్యధిక మంది అభ్యర్థులు పోటీ చేసిన రికార్డు నల్లగొండ పేరిటే ఉంది. అయితే ఆ తర్వాత నామినేషన్ల నిబంధనల్లో మార్పులు చేశారు. డిపాజిట్ సొమ్ము కూడా పెంచారు. ఈ కారణంగా ఆ తర్వాత నిరసనల నామినేషన్లు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. 


Also Read: హుజురాబాద్‌ ఉపఎన్నిక చాలా కాస్ట్‌లీ గురూ ! ప్రభుత్వం.. పార్టీల ఖర్చు ఎంతో తెలుసా ?


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి