Eatala Rajendar: తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు.. నన్ను గెలిపించండి: ఈటల రాజేందర్
హుజూరాబాద్ ఉపఎన్నికలో భాగంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రచార జోరును పెంచారు. కరీంనగర్ జిల్లా సిరసపల్లి, వీణవంక మండలం బేతిగల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. (Image Courtesy: Twitter/Eatala Rajender)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సందర్భంగా తనదైన శైలిలో అధికార టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తనపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. (Image Courtesy: Twitter/Eatala Rajender)
పేదల గొంతుకగా ఉన్న తనను గెలిపించాలని హుజూరాబాద్ ప్రజలను కోరారు. అక్టోబర్ 30న ఓట్లన్నీ కమలం గుర్తుపై పడతాయని.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు నాడు టీఆర్ఎస్ నేతల దిమ్మతిరుగుతుందని అన్నారు. (Image Courtesy: Twitter/Eatala Rajender)
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలవలేదనే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్కు తాను లొంగిపోయినట్లు గతంలోనూ లేఖ సృష్టించారని గుర్తు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తేల్చలేదని పేర్కొన్నారు. (Image Courtesy: Twitter/Eatala Rajender)
బతుకమ్మలతో ఈటల ప్రచారానికి స్వాగతం చెబుతున్న మహిళలు.. (Image Courtesy: Twitter/Eatala Rajender)
కోలాటాలతో స్వాగతం పలుకుతున్న మహిళలు.. (Image Courtesy: Twitter/Eatala Rajender)