Unknown facts about Atomic Bombing:
అప్పటికప్పుడే టార్గెట్ మారిందా..?
77 ఏళ్ల క్రితం 1945లో ఇదే రోజున జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబుల దాడి జరిగింది. అమెరికా చేసిన ఈ పనికి ఇప్పటికీ ఈ నగరాలు కోలుకోలేదు. ఈ విధ్వంసంలో లక్షలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా తెలిసిన విషయాలే అయినా...ఈ విధ్వంసం జరిగిన సమయంలో ప్రపంచానికి తెలియని కొన్ని నిజాలు వెలుగులోకి రాలేదు. చాలా కాలం తరవాత ఇవి ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఆ ఆసక్తికర నిజాలేంటో ఓ సారి చూద్దాం.
1. ఈ అణుదాడుల కోసం టార్గెట్‌లు నిర్ణయించేందుకు ప్రత్యేకంగా ఓ టార్గెట్ కమిటీ ఏర్పాటైంది. ముందుగా ఓ 5 ప్రాంతాలను లిస్ట్‌లోచేర్చారు. వీటిలో కొకుర, హిరోషిమా, యోకోహమా, నీగటా, క్యోటో ఉన్నాయి. అప్పటి సెక్రటరీ ఆఫ్ వార్ హెన్రీ ఎల్ స్టిమ్సన్ క్యోటోను ఈ లిస్ట్ నుంచి తీసేయాలని కోరారు. క్యోటో..తనకెంతో నచ్చిన ప్రదేశమని, తాను హనీమూన్ అక్కడే గడిపానని చెప్పాడు. కేవలం ఆయన మాటతో ఈ లిస్ట్‌లో మార్పులు చేర్పులు చేశారు. హిరోషిమా తరవాత క్యోటోకు బదులుగా నాగసాకిని టార్గెట్‌గా పెట్టుకున్నారు.
2. నాగసాకిలో అణుదాడి జరిగే ముందు వాతావరణం సహకరించలేదు. కొకురపై అణుదాడి చేయాలని భావించారు. అక్కడ కూడా క్లైమేట్ మారిపోయింది. మబ్బులు కమ్మేసి, టార్గెట్‌ను నిర్దేశించుకునేందుకు వీల్లేకుండా పోయింది. ఆగస్టు 11వ తేదీన దాడి చేయాలని ముందుగా అనుకున్నా, వాతావరణం సహకరించకపోవచ్చన్న అనుమానంతో ఈ ప్లాన్‌ను రెండ్రోజుల ముందే అమలు చేసేందుకు రెడీ అయిపోయారు. కొకురకు ఎయిమ్ చేసినా అది వర్కౌట్ అవలేదు. అప్పటికప్పుడు ఈ టార్గెట్ నాగసాకి వైపు మళ్లింది. నాగసాకిలోనూ మబ్బులు కమ్మేసినా, చివరి నిముషంలో ఒక్కసారిగా అంతా క్లియర్ అయిపోయాయి. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ, వెంటనే "ఫ్యాట్ మ్యాన్"(Fat Man)అణుబాంబుని నాగసాకిపై వేశారు. అలా బాంబు ప్రభావానికి గురైంది ఈ నగరం.
3. అప్పటికో హిరోషిమాలో దాడి జరిగి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో భారీ సంఖ్యలో పోలీసులు కూడా ఉన్నారు. అయితే నాగసాకిపైనా అణుదాడి జరిగే ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. "Duck and Cover"వ్యూహంతో తమ ప్రాణాలు కాపాడుకున్నారు. న్యూక్లియర్ ఫైర్ బాల్స్ రేంజ్ నుంచి తప్పించుకుని ఎలా వెళ్లాలో తెలియజేసే స్ట్రాటెజీ ఇది. ఈ వ్యూహాన్ని హిరోషిమా పోలీసులు స్వయంగా వచ్చి, నాగసాకి పోలీసులకు నేర్పించారట. చెప్పింది చెప్పినట్టుగా అమలు చేసి, చాలా మంది పోలీసులు నాగసాకిలోని బాంబుదాడి నుంచి బయటపడ్డారు. సాధారణ పౌరులు మాత్రం బలి కాక తప్పలేదు.
4. హిరోషిమాపై వేసిన బాంబుకి "లిటిల్ బాయ్" (Little Boy)అని పేరు పెట్టారు. ఇక నాగసాకిపై వేసిన బాంబు పేరు "ఫ్యాట్ మేన్" (Fat Man) అని నిర్ణయించారు. ఈ బాంబులను డిజైన్ చేసిన రాబర్ట్ సెర్బర్ ఈ కోడ్ నేమ్స్‌ని సూచించారు. ఈ పేర్లు పెట్టడం వెనకా ఓ ఆసక్తికర కథ ఉంది. ఫ్యాట్ మేన్ బాంబ్ చూడటానికి గుండ్రంగా, లావుగా ఉంటుంది. అయితే అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందిన "The Maltese Falcon"సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఈ పేరు పెట్టారట. సిడ్నీ గ్రీన్‌స్ట్రీట్ తీసిన ఈ మూవీలో "Kasper Gutman" అనే క్యారెక్టర్‌కి గుర్తుగా ఈ నామకరణం చేశారు. ఇదే సినిమాలోని Elisha Cook అనే క్యారెక్టర్ నుంచి స్ఫూర్తి పొంది Little Boy పేరు పెట్టారు.
5. హిరోషిమాపై జరిగిన అణుదాడిలో మృతి చెందిన వారికి గుర్తుగా అక్కడ ఎన్నో స్మారకాలు నిర్మించారు. వాటిలో కీలకమైంది "The Peace Flame". 1964లో శాంతికి చిహ్నంగా ఇక్కడ జ్యోతి వెలిగించారు. అప్పటి నుంచి ఇది ఆరిపోకుండా వెలిగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని అణుబాంబులను ధ్వంసం చేసి, ప్రపంచం ఈ దాడుల ముప్పు నుంచి బయటపడేంత వరకూ ఈ జ్యోతిని వెలిగిస్తూనే ఉంటామని చెబుతారు హిరోషిమా వాసులు.
Also Read: Youth Create Ruckus: బస్సు కింద పడుకుని మరీ హల్ చల్ చేసిన యువకులు, పోలీసులేం చేశారు..?| ABP Desam