Himachal Pradesh elections:


ఏబీపీ న్యూస్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలో..


హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు వెలువడినప్పటి నుంచి అక్కడ భాజపా గట్టిగా ప్రచారం చేస్తోంది. 68 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో 60కిపైగా సీట్లు సాధిస్తామని ఆప్ ప్రకటించుకుంది. ఇటు భాజపా మాత్రం "ప్రధాని మోదీ" చరిష్మాను నమ్ముకుంది. "హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఈ సారి కూడా ప్రధాని మోదీకే అండగా ఉంటారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు" అని అంటున్నారు
సీఎం జైరామ్ ఠాకూర్. ABP Newsకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేసిన ఠాకూర్...కరెన్సీ నోటుపై దేవతల ఫోటోలు పెట్టాలన్న కేజ్రీవాల్ కామెంట్స్‌పైనా స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదని విమర్శించారు. వీర్‌భద్ర సింగ్‌ గురించి ప్రియాంక గాంధీకి ఏం మాట్లాడాలో తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు. పెన్షన్‌ స్కీమ్‌ను పక్కన పెట్టి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. ఈ సారి కేవలం ఓట్ల కోసమే బరిలోకి దిగారని, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే ఆయనకు లేదని మండి పడ్డారు. అంతే కాదు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఎలా మొదలయ్యాయో
గమనించాలంటూ ప్రజలకు సూచించారు. రాజకీయల లబ్ధి కోసమే ఇలాంటివి చేస్తుంటారని అన్నారు. ఇక రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రపైనా విమర్శలు చేశారు జైరామ్ ఠాకూర్. దేశ ప్రజలందరూ క్విట్ కాంగ్రెస్ యాత్ర చేస్తుంటే...ఆయన మాత్రం జోడో యాత్ర చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్‌లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారని అనుకోవటం లేదని, ఒకవేళ రాహుల్ ప్రచారం చేసినా..తమకు వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. 


కాంగ్రెస్‌ పని అయిపోయింది..


భాజపాకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ అన్న మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలపైనా ఠాకూర్ స్పందించారు. కొన్నాళ్ల ముందు వరకూ కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అని భావించారని, కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయని వెల్లడించారు. కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని, ప్రజలు భాజపా డబుల్ ఇంజిన సర్కార్‌నే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. రెబెల్ అభ్యర్థుల గురించి స్పందించిన ఆయన...ఇలాంటి పరిణామాలు ఎన్నికలపై, ప్రజల అభిప్రాయాలపై పెద్దగా ప్రభావం చూపించవని తేల్చి చెప్పారు. హిమాచల్ ప్రజలు ప్రధాని మోదీ వెంటే ఉండాలని నిర్ణయించుకు న్నారని అన్నారు. ఒకప్పుడు హిందూ దేవతల్ని కించపరిచిన వాళ్లు ఇప్పుడు ఉన్నట్టుండి హిందువులుగా మారిపోయారంటూ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశారు జైరామ్ ఠాకూర్. నిస్సహాయ స్థితిలో కేజ్రీవాల్ అలాంటి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 


ఆప్‌నకు అన్ని సీట్లొస్తాయా..? 


గుజరాత్‌తో పాటు హిమాచల్‌లోనూ భాజపాకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఆప్. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బలంనిరూపించుకుంటామని ఆమ్‌ఆద్మీ అధినేత కేజ్రీవాల్ చాలా సందర్భాల్లో చెప్పారు. అటు భాజపాను టార్గెట్ చేస్తూ విమర్శలూ చేస్తున్నారు. అంతే కాదు. హిమాచల్‌ ప్రదేశ్‌లో తమకు ఎన్ని సీట్లు వస్తాయో కూడా జోస్యం చెబుతున్నారు కొందరు ఆప్‌ నేతలు. హిమాచల్ ఆప్‌ అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ ఠాకూర్ ఇటీవలే ఈ లెక్కలు వివరించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌నకు 60కిపైగా సీట్లు వస్తాయని చాలా ధీమాగా చెబుతున్నారు. 
మొత్తం 68 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామన్న సుర్జీత్ సింగ్...60కిపైగా సీట్లు వస్తాయని చెప్పటమే చర్చనీయాంశమైంది. 


Also Read: Karnataka: 'మోదీజీ నన్ను కాపాడండి- నా భార్య చావగొడుతోంది'